{"title":"Newly Added","description":"","products":[{"product_id":"brathukerigina-baatasaari","title":"బ్రతుకెరిగిన బాటసారి - brathukerigina baatasaari","description":"\u003cp\u003eవాస్తవికం, సీరాయి చప్పుళ్ళు ఈ రెండింటి గుణాలను కలగలిపి, తోబుట్టువలే పురుడుపోసుకున్న పుస్తకమే \u003cstrong\u003eబ్రతుకెరిగిన బాటసారి\u003c\/strong\u003e.\u003c\/p\u003e\n\u003cp style=\"text-align: justify;\"\u003eఇందులో కవిత్వాలు వాటికి తగ్గ ప్రాసలు, కొత్త పదాలు కంటే కూడా ఒక బాటసారి మాటలు తను అప్పుడప్పుడు పేల్చే తూటాలు, తను మనతో వేయించాలనుకునే బాటలు వీటికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పుస్తకంలో మాటలు రదివి మనిషిలో పెనుమార్పులు రావాలి అనే కోరిక లో లేదు కానీ మారాలి అనుకునేవాళ్ళకి తోడుగా ఉంటాయనే ఆశ అయితే ఉంది.\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":46997086044396,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/1_3644bf2e-14eb-46c9-8b7e-bfaf569965dc.jpg?v=1764176385"},{"product_id":"arunimalu","title":"అరుణిమలు - arunimalu","description":"\u003cp style=\"text-align: justify;\"\u003eఎన్నో రూపాంతరాలు చెందిన 'భూమికి' ఓర్పు ఎక్కువంటారు. తనలో, తనచుట్టూ, తనపై జరిగే అనేకానేక పరిణామాలను, ప్రకంపనలను, ప్రేలాపనలను మోస్తూ ఉంటుంది కాబట్టి! కానీ వాటన్నింటినీ భరించలేక తన గోడును వివరించలేక జీవిస్తున్న ప్రతి ప్రాణి వ్యధలను, జీవం లేని ప్రతి అణువుల బాధలను ఒడిసిపట్టి తెలుగనే కలంతో ఈ పుస్తకంలో బంధించింది. తన కంటే అసలు సహనశీలి ఆ సూర్యుడు అంటూ ఆయనని తన స్నేహితుడిలా పరిచయం చేసింది. మండే సూరీడిలో దాగున్న మోయలేని భారత్వపు బాధ్యతను పరికింపచేసింది. మానవాళికో ఆశ చూపిస్తూ మనల్ని పట్టించుకోని 'నేడు' లను గమనిస్తూ 'రేపు'లకు కొత్త స్ఫూర్తితో సిద్ధమవ్వాలని అర్థం చేయిస్తూ సాగే అక్షర ప్రయాణమే ఈ అరుణిమల అంతరార్థం.\u003c\/p\u003e\n\u003cp style=\"text-align: justify;\"\u003eపాఠకులారా! ఈ పుస్తకం మీకో చేదోడులా మిమ్మల్ని మీరు నిలదొక్కుకోలేని సమయాల్లో, మీలో మీరు కుమిలిపోతున్న సందర్భాల్లో మిమ్మల్ని మేల్కొల్పే సాధనంగా ఉంటుందని నేను భావిస్తున్నాను.\u003c\/p\u003e","brand":"BUUK palace Publications","offers":[{"title":"Default Title","offer_id":47015903625452,"sku":null,"price":129.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/arunimalu_front.jpg?v=1764176582"},{"product_id":"churakalu","title":"చురకలు - churakalu","description":"\u003cp\u003eచురకలు” అనేది సమకాలీన సమాజ పోకడల, మారుతున్న మనస్తత్వాలపై లేఖాగీతార్ధకంగా రాసిన చిన్న కవితల మాలిక. ఇందులో రచయిత విసిరిన “చురకలు” ద్వారా ప్రతి మనిషి ఆత్మసమీక్ష చేయాల్సిన అవసరాన్ని జగృహించేలా చేస్తాడు. ఇతర్థంలో, అనుకోకుండా కలిసిన పరిచయాలు, వ్యక్తిగత భావాలు, వాడే మాటల్లోని లోతు — ఇవన్నీ భావోద్వేగాలైన తళుకులుగా పుస్తకంలో ప్రతిఫలిస్తాయి.\u003c\/p\u003e","brand":"Kondal Rao Addagalla","offers":[{"title":"Default Title","offer_id":47020110315756,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/churakalu.jpg?v=1764176846"},{"product_id":"aanelu","title":"ఆనెలు - aanelu","description":"\u003cp class=\"PlaygroundEditorTheme__paragraph\" dir=\"ltr\"\u003e\u003cspan class=\"transliteration\"\u003eఆనెలు\u003c\/span\u003e\u003cspan\u003e (Calluses) \u003c\/span\u003e\u003cspan class=\"transliteration\"\u003eఅంటే\u003c\/span\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003cspan class=\"transliteration\"\u003eఅరికాళ్లలో\u003c\/span\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003cspan class=\"transliteration\"\u003eవేసే\u003c\/span\u003e\u003cspan\u003e చిన్నపాటి కాయలు అని అర్ధం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"PlaygroundEditorTheme__paragraph\" dir=\"ltr\"\u003e\u003cspan\u003eమనిషి అడుగు తీసి అడుగు వేస్తే నొప్పిని గుర్తుచేయడమే వాటి కర్తవ్యం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"PlaygroundEditorTheme__paragraph\" dir=\"ltr\"\u003e\u003cspan\u003eఅలానే అక్షరాలతో అల్లుకున్న పదాలు కూడా మనిషికి అప్పుడప్పుడు 'ఆనెలు' వంటివే అని నా భావన.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"PlaygroundEditorTheme__paragraph\" dir=\"ltr\"\u003e\u003cspan\u003eమనిషి సన్మార్గంలో వెళ్ళనప్పుడు, హెచ్చులకి పోయినప్పుడు, అహంకారం తాలుకా హడావిడి పెరిగినప్పుడు ఆనెలు పడాల్సిందే.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"PlaygroundEditorTheme__paragraph\" dir=\"ltr\"\u003e\u003cspan\u003eఅంతే కాదు సమాజ విలువలు గుర్తుచేస్తూ, సోమరుల చెవుల్లో అరుస్తూ, నిస్సహాయుల ఆలోచనలకి పదును పెడుతూ మందిని ముందుకు నడిపించడమే ఈ ఆనెలు ప్రత్యేకత. \u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47024499294444,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/aanelu.jpg?v=1764176980"},{"product_id":"aakhari-siraa-chukkalu","title":"ఆఖరి సిరా చుక్కలు - aakhari sira chukkalu","description":"\u003cp\u003eమరణం అనే మహాసాగరంలో మమేకం అయ్యే ముందు ఓ రచయిత తన జీవితానికి కవితా రూపం ఇచ్చి సిరాతో తన అనుభవాలు, తన అనుభూతులు, గాయాలు, జ్ఞాపకాలు పంచుకోవడమే ఈ...\u003c\/p\u003e\n\u003cp style=\"text-align: right;\"\u003e\u003cstrong\u003eనా ఆఖరి సిరా చుక్కలు.\u003c\/strong\u003e\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47024515186924,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/aakhari_sira_chukkalu.jpg?v=1764177073"},{"product_id":"anantha-vilomaalu","title":"అనంత విలోమాలు - anantha vilomaalu","description":"\u003cp\u003eకొన్ని రాతలు రగిలే జ్వాలగా రాగాలు తీస్తుంటాయి\u003cbr\u003eఇష్టంగా వినండి\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eమరికొన్ని మొరాయిస్తూ మారం చేస్తాయి\u003cbr\u003eఓపికగా చదవండి\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eఇంకొన్ని మనసుని ప్రేమగా పిలుస్తాయి\u003cbr\u003eహాయిగా పలుకరించండి\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eమరిన్ని మొహంతో కూరత్వాన్ని కనబరుస్తాయి \u003cbr\u003eభారంగా వున్నా భరిస్తూ చదవండి\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eఏదేమైనప్పటికీ చదివాక పొందిన అనుభూతిని నాతో పంచుకోండి\u003c\/p\u003e\n\u003cp style=\"text-align: right;\"\u003e\u003cspan class=\"transliteration\"\u003eడా\u003c\/span\u003e\u003cspan\u003e|| \u003c\/span\u003e\u003cspan class=\"transliteration\"\u003eశ్రీ\u003c\/span\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003cspan class=\"transliteration\"\u003eఅనూహ్య\u003c\/span\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003cspan class=\"transliteration\"\u003eరావిళ్ల\u003c\/span\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47024519839980,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-11-26at7.52.30PM_1.jpg?v=1764177162"},{"product_id":"nissabdhapu-chappullu","title":"నిశ్శబ్దపు చప్పుళ్ళు - nissabdhapu chappullu","description":"\u003cp\u003eపూలు ఎంత సుకుమారంగా ఉంటాయో కదా? \u003c\/p\u003e\n\u003cp\u003eస్త్రీల మనుసులు కూడా అంతే సున్నితం. \u003c\/p\u003e\n\u003cp\u003eఒక పువ్వు గాయపడితే, ఎలాగైతే కోలుకోలేదో స్త్రీ మనసూ అంతే! \u003c\/p\u003e\n\u003cp\u003eకానీ, స్త్రీకి తన గాయానికి మందు పూసుకునే అవకాశం ఉంది. \u003c\/p\u003e\n\u003cp\u003eమళ్ళీమళ్ళీ గాయపడకుండా తనని కాపాడుకునే అవకాశాలున్నాయి. \u003c\/p\u003e\n\u003cp\u003eఈ నవలలో నిత్య మనసు గాయపడింది. \u003c\/p\u003e\n\u003cp\u003eమరి తనెలా అవకాశాన్ని వెతుక్కుంటుంది? \u003c\/p\u003e\n\u003cp\u003eతననే చేరి వచ్చిన అవకాశాన్ని తనే వదులుకుని మళ్ళీ ఎలా పొందుతుంది అనేదే కథ! \u003c\/p\u003e\n\u003cp\u003eఈ నవల రాసిన నేను లలిత. స్వతంత్ర నవలతో పేరు పొంది, స్వతంత్ర భావాలను వికసించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండే చిన్ని ఆశాజీవిని. \u003c\/p\u003e\n\u003cp\u003eఈ నిశ్శబ్దపు చప్పుళ్ళు మిమ్మల్ని నిశ్శబ్దంగా నా ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. వస్తారా మరి!\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47024530096364,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/nissabdhapu_chappullu.jpg?v=1764177415"},{"product_id":"edhureetha","title":"ఎదురీత - Edhureetha","description":"\u003cp style=\"text-align: center;\"\u003eనన్ను అల్లుకున్న భావం \u003cbr\u003eదానికోసం \u003cbr\u003eనేను అందుకున్న కలం \u003cbr\u003eఅదో మంచి కాలం \u003cbr\u003eఅప్పుడు నేనో కవిత రాస్తే !! \u003cbr\u003eఆరోజు అమావాస్యైనా\u003cbr\u003eనా ఎదలో వెన్నెల కురిసిన ఆనవాళ్ళు \u003cbr\u003eఆ ప్రాంతం నిశ్శబ్దంగా ఉన్నా \u003cbr\u003eనా మదిలో వేవేల ఈలల గోలలు !!\u003c\/p\u003e\n\u003cp style=\"text-align: right;\"\u003e\u003cspan class=\"transliteration\"\u003e- అల్లం\u003c\/span\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003cspan class=\"transliteration\"\u003eఅరుణ్\u003c\/span\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003cspan class=\"transliteration\"\u003eకుమార్\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47024562667756,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/edhureetha.jpg?v=1764177557"},{"product_id":"kavvinche-kathalu","title":"క(న)వ్వించే కథలు - kavvinche kathalu","description":"\u003cp\u003eనా మనసు లోతుల్లో ఆలోచిస్తున్న\u003cbr\u003e ఆలోచనలకి గాలాడక అల్లాడుతున్నపుడు, \u003cbr\u003eనల్లటి నా కళ్ళకి తెల్లటి కాగితం చూపించిందొకామె.\u003cbr\u003e\nనా అలజడి గుండె గదుల్లో \u003cbr\u003eవాన కురిపించి, తడిని నింపి, \u003cbr\u003eనాలో ఉన్న భావాల్ని కాలువ కట్టేలా చేసి,\u003cbr\u003e సిరాని నా సిరల్లో నింపేసింది.\u003cbr\u003e\nఆ క్షణం కాగితం ఇక నా జీవితం \u003cbr\u003eఅన్నట్టుగా సాగాలని \u003cbr\u003eఅనుభవాల అనుభూతులతో \u003cbr\u003eఅక్షరాల చుక్కలతో \u003cbr\u003eముగ్గుల్ని వేసి, ముగ్ధుల్ని చేయడానికి \u003cbr\u003eనాకు తెలీకుండానే \u003cbr\u003eనా చేతి వేళ్ళు ముడుచుకున్నాయి.\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47027458408684,"sku":null,"price":143.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/kavvinche_kathalu.jpg?v=1764177619"},{"product_id":"meluko","title":"మేలుకో - meluko","description":"\u003cp style=\"text-align: center;\"\u003eఈ \"\u003cstrong\u003eమేలుకో\u003c\/strong\u003e\" కవితాసంపుటికి మొదలు నా బాల్యంలో \u003cbr\u003eబడి తరగతిన నా మెదడున మెదిలిన మొదటి కవిత.\u003cbr\u003eఈ పుస్తకానికి నాంది.\u003cbr\u003e\" పుట్టిన్నాడు పేదలపొట్టనా,\u003cbr\u003eసాగించినాడు తెలంగాణ పోరాటన, \u003cbr\u003eకాంక్షించినాడు విజయ గర్జన,\u003cbr\u003eజయించినాడు ఆశయ భావన, \u003cbr\u003eకానీ చివరకు దక్కలేదు మనకు ఆయన, \u003cbr\u003eతెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు \"\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp style=\"text-align: right;\"\u003e- అరుణ్ వంకేశ్వరం\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47027468533996,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-11-28at11.39.19PM.jpg?v=1764357422"},{"product_id":"vruddhasramam","title":"వృద్ధాశ్రమం - vruddhasramam","description":"\u003cp style=\"text-align: center;\"\u003eఈ భూమి మీద ఎవ్వరూ శాశ్వతం కాదు, \u003cbr\u003eభూమి మాత్రమే శాశ్వతం.\u003cbr\u003eనువ్వు డబ్బు సంపాదించి ఎంత గొప్పగా బ్రతికినా \u003cbr\u003eఊరు చివర నీ శరీరం కోసం స్మశానం ఎదురు చూస్తూనే ఉంటుంది. \u003cbr\u003eనీ చావుకి సమయం రానంత వరకే \u003cbr\u003eఈ భూమి మీద నువ్వు ఎన్ని నాటకాలు వేసినా చెల్లేది.\u003cbr\u003eనాలో ఉన్న ఆశయాలు, ఆలోచనలు\u003cbr\u003eసముద్రంలో తుఫాన్ వలె సమాజంపై విరుచుకపడుతున్నప్పుడు \u003cbr\u003eఎవ్వరైనా సరే అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే\u003cbr\u003eఆ అలల తాకిడికి కొట్టుకుపోతారు.\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47027477315820,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/vriddhasramam.jpg?v=1764177787"},{"product_id":"aggi-raathalu","title":"అగ్గి రాతలు - aggiraathalu","description":"\u003cp style=\"text-align: center;\"\u003eఈ నా పుస్తకం... \u003cbr\u003eనా కపాల గూడులో జరిగిన యుద్దంలో నుంచి\u003cbr\u003eపుట్టిన పురిటి బిడ్డ...\u003cbr\u003eనాలో ఆవేశానికి ఆక్రోశానికి మధ్యలో రగిలిన \u003cbr\u003eఅగ్ని కణం.. \u003cbr\u003eవ్యవస్థలు అవస్థలు పడుతుంటే.. \u003cbr\u003eఅసమానతలు అడుగడుగునా అక్కసు కక్కుతుంటే \u003cbr\u003eఅంధకారం కళ్ళ నిండా కుక్కుకొని.. \u003cbr\u003eఅందంగా ఆనందంగా జీవిస్తున్నాం... \u003cbr\u003eబద్దకపు, అబద్ధపు బ్రతుకు బతుకుతున్నాం.. \u003cbr\u003eకుల మత రొచ్చులు \u003cbr\u003eమనిషి మనిషికీ మధ్య జరిగే చిచ్చులు \u003cbr\u003eఅంటరానితనాన్ని పెంచి పోషించే శక్తులు...\u003cbr\u003eఆడపిల్లల్ని ఆగాదంలోకి తోసే కుయుక్తులు.. \u003cbr\u003eఅన్ని చూసి... \u003cbr\u003eనా కోప తుఫాన్ నుంచి కొట్టుకొచ్చిన పుస్తకం.. \u003cbr\u003eనా వేదన వడగండ్ల నుంచి ఉబికి వచ్చిన పుస్తకం.. \u003cbr\u003eనా గుండె గాండ్రింపు గాలి నుంచి జన్మించిన పుస్తకం.. \u003cbr\u003eఅగ్గి లాంటి నిజాలు బుగ్గి కాకుండా..\u003cbr\u003eబరువెక్కిన హృదయంతో.. బాధతో రాస్తున్న పుస్తకం... \u003cbr\u003eఈ నా అగ్గిరాతలు... మన తలరాతలను మార్చే రాతలు..\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp style=\"text-align: right;\"\u003e- విద్యాసాగర్ యాసరవేణి\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47027528728812,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/aggiraathalu.jpg?v=1764177874"},{"product_id":"neti-samaajam","title":"నేటి సమాజం - neti samaajam","description":"\u003cp style=\"text-align: center;\"\u003eఎంతటి వెర్రి వాడిని నేను\u003cbr\u003eనేను రాసే ఈ అక్షరాలతో \u003cbr\u003eఈ లోకాన్ని మార్చాలి అనుకుంటున్నాను. \u003cbr\u003eఎవడు చదువుతాడు \u003cbr\u003eనేను రాసే ఈ పుస్తకాన్ని \u003cbr\u003eఎవడు వింటాడు \u003cbr\u003eనా పుస్తకం లో దాగి ఉన్న ఘోషని.\u003cbr\u003eతెలుగు సరిగా చదవటం రాని నేటి యువతకి \u003cbr\u003eమంచం మీద ముసలిదాని గురించి చెబుతున్నాను.\u003cbr\u003eకామకులకి \u003cbr\u003eఒక చిట్టితల్లి నరకయాతనని చెప్పుచున్నాను \u003cbr\u003eఒళ్ళు బద్ధకంతో ఉన్న నేటి యువతరానికి \u003cbr\u003eకష్టాల గురించి చెప్పుచున్నాను \u003cbr\u003eఎంతటి వెర్రి వాడిని నేను \u003cbr\u003eనేను రాసే ఈ అక్షరాలతో \u003cbr\u003eఈ లోకాన్ని మార్చాలి అనుకుంటున్నాను\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47027535282412,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/neti_samajam.jpg?v=1764178153"},{"product_id":"seetha-raasina-raamaayanam","title":"సీత రాసిన రామాయణం - sitha raasina raamaayanam","description":"\u003cp\u003e\"ఒకే సూర్యుడు, \u003cbr\u003eవాళ్ళ కోసం రెండుసార్లు ఉదయించాడు. \u003cbr\u003eఈ సీతారాముల ప్రేమ చూసి, \u003cbr\u003eకాలమే దారి తప్పి వెనక్కి నడిచింది.\u003c\/p\u003e\n\u003cp\u003eఆ అద్భుతం \u003cbr\u003eఒక ఆరంభం మాత్రమే...\u003cbr\u003eఆ తర్వాత మొదలైన\u003cbr\u003eఅసలు ప్రయాణమే,\u003cbr\u003eసీత రాసిన రామాయణం.\"\u003c\/p\u003e","brand":"Vidhmani Publications","offers":[{"title":"Default Title","offer_id":47027675463916,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/seetha_rasina_ramayanam.jpg?v=1764180206"},{"product_id":"emantavoi-nadura","title":"ఏమంటావోయ్ నరుడా - Emantavoye Naruda","description":"\u003cp style=\"text-align: center;\"\u003eచిన్న చిన్న విషయాలను,\u003cbr\u003eకొన్ని అందరికీ తెలిసిన సత్యాలను \u003cbr\u003eకవితల పుస్తకంగా రాసా. \u003cbr\u003eకవినైన పుణ్యానికి \u003cbr\u003eకాస్త అందంగా రాసానంతే\u003c\/p\u003e","brand":"Arun Kumar Allam","offers":[{"title":"Default Title","offer_id":47027678642412,"sku":null,"price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-12-08at9.22.17PM.jpg?v=1765209480"},{"product_id":"sitha-sametha-raama","title":"సీతా సమేత రామ - Sitha Sametha Rama","description":"\u003cp class=\"PlaygroundEditorTheme__paragraph\" dir=\"ltr\"\u003e\"వర్షం తర్వాత చెప్పులకు అంటిన బురద చూసి చిరాకు పడే మనుషుల మధ్య, \nతడిసిన మట్టి ఇచ్చే సువాసనలో ఆనందం వెతికేలా రాసిన కథ.\"\u003c\/p\u003e\n\u003cp class=\"PlaygroundEditorTheme__paragraph\" dir=\"ltr\"\u003e\u003cspan\u003eఇతరులకి చెప్పేటంత పెద్దదాన్ని కాదు. అలా అని నిజాన్ని చెప్పకుండా దాచిపెట్టె రకంకూడా కాదు. \"ప్రేమ చచ్చిపోయి, పాపాలు పెరిగిన ప్రపంచంలో.. పెరుగుతూ వస్తున్న ఆడపిల్లని..\". మనసుకి ఎంత వద్దు అనిపించినా, పెళ్లిచేసుకుని మరొకరి జీవితంలోకి వెళ్లక తప్పదు అని తెలుసు. నేను మాత్రమే కాదు, నాలాంటి ఎందరో అమ్మాయిలు కావాలనుకునే ఒక చిన్న ప్రేమ కథ.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"PlaygroundEditorTheme__paragraph\" dir=\"ltr\"\u003e\u003cspan\u003e\"తల్లిదండ్రుల తగువుల్లో, ప్రస్తుత కాలపు ప్రేమల మధ్య మౌనంగా మారిపోయిన ప్రతి మనసుకి ప్రేమని మళ్ళీ పరిచయం చేస్తూ... ఓదార్పుగా నిలిచిన కథ – సీతా సమేత రామ\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47029187346668,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-11-27at1.02.19AM.jpg?v=1764185617"},{"product_id":"amalodbhavilo-arjunudu","title":"అమలోద్భవిలో అర్జునుడు - amalodbhavilo arjunudu","description":"\u003cp\u003e”స్వధర్మాన్ని నిబద్ధతతో పాటించు.. \u003cbr\u003eఫలితాన్ని గురించి ఆందోళన చెందకు.” \u003cbr\u003eఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, క్రమం తప్పకుండా, \u003cbr\u003eధర్మం కోసం, న్యాయం కోసం పోరాడే ప్రతి వ్యక్తి వీరుడే, అర్జునుడే!\u003c\/p\u003e\n\u003cp\u003eమీరూ అర్జునులే! \u003cbr\u003eమీ జీవితం కురుక్షేత్రం. \u003cbr\u003eమీ ధర్మం మీ గాండీవం.\u003cbr\u003eజయించండి! ధర్మ జయతే!\u003c\/p\u003e","brand":"Vijay Appalla","offers":[{"title":"Default Title","offer_id":47036998910188,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-11-26at8.35.38PM_1.jpg?v=1764353988"},{"product_id":"arjun-s-o-sujatha-rao","title":"అర్జున్ s\/o సుజాత రావు - Arjun s\/o Sujatha Rao","description":"\u003cp\u003eసుబ్బారావు - సుజాత దంపతులకి పిల్లలు పుట్టకపోవడంతో డా. ప్రకాష్ రాజ్ ని ఆశ్రయిస్తారు. ఆయన వీరికి మందులు ఇచ్చి, వైద్యం చేస్తారు. ఏడాది తిరగకుండానే పండంటి మగబిడ్డ పుడతాడు. వాడే అర్జున్. \u003cbr\u003eఅర్జున్ కి 2-3 ఏళ్ళు వచ్చేసరికి, వాడు చెసే విన్యాసాలకు వాడికి నొప్పి అంటే తెలీదు అని డా. మురళీకృష్ణ చెబుతారు. అప్పటికే డా. ప్రకాష్ రాజ్ వేరే నగరానికి బదిలీ అవుతారు. ఇటువంటి పిల్లలు 5 - 6 ఏళ్ల కన్నా ఎక్కువ బ్రతకరు అని చెబితే, సుజాత విధికి ఎదురేగి అర్జున్ ని ధీరుడిలా పెంచాలి అని ఆశపడుతోంది.\u003cbr\u003e ఆమె ఆశ నెరవేరిందా? నిరాశగా మిగిలిపోయిందా? \u003cbr\u003eఅర్జున్ కి వున్నది వరమా? శాపమా? పాపమా? లోపమా?\u003cbr\u003e అర్జున్ ఎదిగే కొద్దీ అతనిలా అద్భుత శక్తులు వున్న మనుషులు ఎదురు పడుతుంటారు. వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు అర్జున్ తో  వుంటారా? లేక అర్జున్ ని ఎదుర్కొంటారా?\u003c\/p\u003e","brand":"Vijay Appalla","offers":[{"title":"Default Title","offer_id":47037033775340,"sku":null,"price":175.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-11-27at5.58.36PM_4dbd3739-4e46-4053-8874-1244734d6539.jpg?v=1764356735"},{"product_id":"please-empty-your-mind","title":"Please Empty Your Mind","description":"\u003cp\u003eమనిషి, తాను ఏదైనా కొత్తగా ఆలోచించాలన్నా, నేర్చుకోవాలన్నా దానికి సంబంధించిన పాత విషయాలను పక్కన పెట్టి నూతనంగా వినడం, ఆలోచించడం వల్ల , ఆ విషయం పైన లోతైన అవగాహన ఏ విధంగా కలుగుతుందో తర్కబద్ధమైన ఉదాహరణలతో ఈ పుస్తకం రూపొందించబడింది.\u003cbr\u003eఈ పుస్తకంలో మూడు చాప్టర్లు ఉన్నాయి. అవి ‘ది పార్ట్నర్, ది టీచర్ మరియు ది మ్యాన్’. ఈ కథలో కథనాయకుడు ఒక విద్యార్థిగా, ఒక గురువుగా, ఒక పరిపూర్ణ వ్యక్తిత్వంతో ఈ సమాజాన్ని మనకు చాలా దగ్గరగా అర్థమయ్యేటట్లు చర్చిస్తాడు\u003cbr\u003eఅపోహలు, అబద్దాల నడుమ తమను తాము సంస్కరించుకోవడం మర్చిపోతున్న ఈ రోజుల్లో ఈ పుస్తకం నిజం వైపు నిలబడి ఆలోచించేటట్లు, స్వీయ సంస్కరణకు ఆలోచనలను ప్రోత్సహిస్తుంది.\u003cbr\u003eతాత్విక, హేతువాద భావనలతో మనిషి తనంతట తానుగా తనలోని భావోదేవగల చర్యలను అర్థం చేసుకొని జీవితాన్ని సరళంగా సాగేలా ఒక తాత్విక మార్గాన్ని పరిచయం చేస్తుంది...\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47072127615212,"sku":null,"price":199.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-12-04at8.07.43AM.jpg?v=1765002771"},{"product_id":"hyderabad-metro-tales","title":"Hyderabad Metro Tales","description":"\u003cp\u003eEvery day, many passengers travel by metro train. There is a unique story behind every passenger, whether it is a happy one or a bitter one. Sometimes we get to know other passengers' stories or share our own stories. With this idea, I came up with \"Hyderabad Metro Tales\". This book consists of 50 tales, sorry 50 lives. By mixing both reality and fiction, I wrote these stories. You may think about other metro passengers or you may interact with other metro passengers after you read this book. This book will make any metro passenger and reader feel the vibe of metro while reading it.\u003c\/p\u003e","brand":"Vamsi Krishna","offers":[{"title":"Default Title","offer_id":47071276957932,"sku":null,"price":199.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/image-1.png?v=1765004083"},{"product_id":"kala-kathalu","title":"కళ కథలు - Kala Kathalu","description":"\u003cp style=\"text-align: center;\"\u003eవెతికితే తట్టే కథలు వేరు,\u003cbr\u003eవెతుక్కుంటూ వచ్చే కథలు వేరు. \u003cbr\u003eఈ కథలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. \u003cbr\u003eనాకు తోచినట్లు కాకుండా వాటిని తలుచుకుంటూ రాయమని అడిగాయి.\u003cbr\u003eకవితలతో మూడు పుస్తకాలకి నాంది పలికిన నా కలాన్ని \u003cbr\u003eఈసారి ఇలా కథల కోసం కదలించాను. \u003cbr\u003eకథ రాయడం ఒక కళ అని భావించి \u003cbr\u003e'కళ కథలు' గా నామకరణం చేశాను.\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47074586657004,"sku":null,"price":169.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-12-07at9.00.22PM.jpg?v=1765165427"},{"product_id":"siraayi-chappullu","title":"సిరాయి  చప్పుళ్ళు - Sirayi Chappullu","description":"\u003cp\u003eవాస్తవికం అనే పుస్తకంతో రచయితగా ప్రయాణం మొదలుపెట్టిన నేను \u003cbr\u003e ఈ సిరాయి చప్పుళ్ళుని మీకు వినిపించాలనుకుంటున్నాను.\u003c\/p\u003e\n\u003cp\u003eఈ పుస్తకం గురించి చెప్పాలంటే \u003cbr\u003eమనసులో కుమిలిపోతూ మనిషి చెప్పుకోలేని బాధల్ని,\u003cbr\u003e ప్రకృతిని వికృతంగా చేస్తున్న మనిషి ఆగడాల్ని చూసి తట్టుకోలేక \u003cbr\u003eనిదురపోతున్న తెల్లటి కాగితాన్ని తట్టి లేపి \u003cbr\u003eఅక్షరాలని అల్లుతూ పదాలని పేర్చుతూ కవితలుగా కూర్చి \u003cbr\u003eకాగితాలపై చప్పుళ్ళు చేస్తూ ఘోషని వినిపించేవే \u003cbr\u003eఈ సిరాయి చప్పుళ్ళు.\u003c\/p\u003e\n\u003cp\u003eఇందులో అంతర్భాగంగా ఉండే చురకులు, \u003cbr\u003eరెండే వాక్యాలతో మనిషికి తగిలే వేడి నూనె చురకల్లా మనుసుని గుచ్చి వదులుతాయ్,\u003cbr\u003eకను రెప్ప వెయ్యకుండా చేస్తాయ్.\u003c\/p\u003e","brand":"Kondal Rao Addagalla","offers":[{"title":"Default Title","offer_id":47076698751212,"sku":"9789354456756","price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-12-08at9.21.30PM.jpg?v=1765211532"},{"product_id":"prayaanikudu","title":"ప్రయాణికుడు - Prayanikudu","description":"\u003cp\u003eతన పేరు కూడా తెలియని ఒక పిల్లాడు కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయిన తండ్రి కోసం వెతుక్కుంటూ వెళ్ళిన ప్రయాణమే ఈ కథ!\u003c\/p\u003e\n\u003cp\u003eఈ పుస్తకం చదివిన ఎవరికైన ఖచ్చితంగా కొత్త అనుభూతి కలుగుతుంది. కథ రాజుల కాలంలో జరిగినా, సాధారణ తెలుగుని ఉపయోగించడం జరిగింది.\u003c\/p\u003e\n\u003cp\u003e100 పేజీలు లోపల ఉన్న పుస్తకం చేతిలోకి తీసుకుంటే పూర్తయ్యేవరకు వదిలిపెట్టరు! \u003c\/p\u003e\n\u003cp\u003e వస్తున్న వేల పుస్తకాల మధ్య ఓ వైవిధ్యమైన పుస్తకం...\u003c\/p\u003e","brand":"Manu Sai Tej Reddy","offers":[{"title":"Default Title","offer_id":47076700946668,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-12-08at9.15.37PM.jpg?v=1765211987"},{"product_id":"seethammaki-vuttharaalu","title":"సీతమ్మకి ఉత్తరాలు - Seethammaki Vuttharaalu","description":"\u003cp\u003eసూర్య-దేవి అనే దంపతులు అనుకోని పరిస్థితుల్లో ఓ పరాయి ఇంట్లో నివసించాల్సి వస్తుంది. ఆ ఇంటి తోటలో ఉన్న ఒక సమాధి దగ్గర, తన జీవితంలో చెప్పుకోలేకపోయిన అనుభూతులు, పశ్చాత్తాపాలు తన భార్య సీతమ్మకు రాసి పెట్టిన రామన్న కథే ఈ “సీతమ్మకు ఉత్తరాలు.”\u003c\/p\u003e\n\u003cp\u003eఈ నవల పూర్తిగా 80s-90s కాలానికి చెందినది- ఒక పాత తెలుగు సినిమా చూసినట్టుగా, గుండె లోతుల్లోకి దిగే కథ. 18 నుండి 75 ఏళ్ల వరకు మనిషి అనుభవించే అన్ని భావాల్ని తాకే ఈ కథను మొదటి నవలగా రాయాలని అనిపించింది. ఎందుకంటే ఇందులో నాకు వ్యక్తిగతంగా తెలిసిన చిన్న చిన్న కథలు, అనుభవాలు, జ్ఞాపకాలు, ఊహలు అన్ని జోడించి రాశాను.\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47083854069996,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/image-36_1.png?v=1765455478"},{"product_id":"manalone-srinivasu","title":"మనలోనే శ్రీనివాసు - Manalone Srinivasu","description":"\u003cp\u003eసప్తధార ఏడు పుస్తకాల కలయిక ఏడు పాత్రల కదలిక. ప్రతీ కోణంలో ఒక కథ పురుడు పోసుకుంటుంటే, ప్రతీ కథలో కొత్త కోణాలు వెలువడుతూ ఉంటాయి. \u003cbr\u003eపాత్రల తాలూకా కొలమానాలు సంగతి పాఠకులకి వదిలేస్తూ వాటి మధ్య జరిగే సంఘర్షణలు, సంభాషణలు నేను పూరిస్తూ, ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతున్నాను.\u003c\/p\u003e","brand":"Kondal Rao Addagalla","offers":[{"title":"Default Title","offer_id":47097599262956,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-12-12at5.13.24PM.jpg?v=1765540152"},{"product_id":"bhumini-nenu","title":"భూమిని నేను - Bhumini nenu","description":"\u003cp style=\"text-align: left;\"\u003e\"ప్రేమలేక మిగిలిపోయిన ప్రేమలేఖను నేను!\"\u003cbr\u003eఈ ఒక్క వాక్యంలోనే స్త్రీ ఆంతరంగిక ప్రపంచం ఉంది. \u003cbr\u003eప్రేమించి భంగపడిన మానని గాయాలు ఉన్నవి.\u003cbr\u003eభూ కంపాలను రిక్టర్ స్కేల్ తో కొలుస్తున్నాం,\u003cbr\u003eమరి పగుళ్లొచ్చిన స్త్రీ హృదయాన్ని ఏం పరికరాలతో కొలుస్తాం? \u003cbr\u003eకొలవడం మాట అటుంచితే వాళ్ళ బాధను అర్థం చేసుకుంటున్నామా? \u003cbr\u003eఇలాంటి రచనలు వచ్చినపుడు ఆమె కూడా మనలాంటి మనిషే అని తెలుసుకుంటాం.\u003cbr\u003eమనలోపలి ఆధిపత్యాలను తుంచి వేసుకుంటాం.\u003cbr\u003e\u003cbr\u003e“Bhoomi ni Nenu” is a unique literary work that reflects human emotions through the voice of the Earth. In some parts, the Earth speaks like a mother; in others, she takes the form of a girl, responding to social issues, emotions, and experiences.\u003cbr\u003eThis launch event will include a brief reading session, author interaction, and a discussion on the inspiration behind the book and its message.\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Sunka Dharani","offers":[{"title":"Default Title","offer_id":47128204935404,"sku":null,"price":129.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-12-18at3.57.47PM_1.jpg?v=1766068434"},{"product_id":"macchuki-manasu-palikina-padhahaaru-kathalu","title":"మచ్చుకి -  మనసు పలికిన పదహారు కథలు - macchuki manasu palikina padhahaaru kathalu","description":"\u003cp\u003eమచ్చుకి – \"మనసు పలికిన పదహారు కథలు\"— ఈ పుస్తకం నా జీవితంలో దాగి ఉన్న కొన్ని నవ్వులు, కొన్ని బాధలు, కొన్ని నిశ్శబ్దాలు...\u003c\/p\u003e\n\u003cp\u003eఇంకా నాకు నేర్పిన అనేక అనుభవాల నుంచి పుట్టినవి.\u003c\/p\u003e\n\u003cp\u003eఈ పదహారు కథలలో ప్రతి ఒక్కటి, నేను చూసిన మనుషులు, వారి ప్రయాణాలు, పడిపోయిన సందర్భాలు, లేచిన క్షణాలు, మాటల్లో పెట్టలేని భావాలతో నిండిపోయి ఉంటాయి.\u003c\/p\u003e\n\u003cp\u003e- పడిపోవడం తప్పు కాదు. పడి లేవకుండా ఉండడం తప్పు.\u003c\/p\u003e\n\u003cp\u003eఅదే నిజం నాకు నేర్పిన ప్రతి సంఘటన, ప్రతి గాయం, ప్రతి చిరునవ్వు... ఈ కథల రూపంలో మీ ముందుకు వచ్చాయి.\u003c\/p\u003e\n\u003cp\u003eనా ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది – ఈ కథలు నాకిచ్చిన ధైర్యం, మీకూ ఇవ్వాలని మాత్రమే నా ఆశ. ఈ పుస్తకంలో ఉన్న ఏదో ఒక వాక్యం... ఏదో ఒక క్షణం...\u003c\/p\u003e\n\u003cp\u003eమీలోని మౌనాన్ని పలకరించి, మీ జీవితానికి కొద్దిగా వెలుగు నింపితే-ఈ పుస్తకం పుట్టిన ప్రయాణానికి అప్పుడు నిజమైన అర్థం దొరికినట్టే.\u003c\/p\u003e\n\u003cp\u003eమణికంఠ శంకు AJ :)\u003c\/p\u003e","brand":"Manikanta Sanku","offers":[{"title":"Default Title","offer_id":47134178115820,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-12-22at12.06.14AM.jpg?v=1766381119"},{"product_id":"oka-endaakaalapu-madhyaahnam","title":"ఒక ఎండాకాలపు మధ్యాహ్నం - Oka Endaakaalapu Madhyaahnam","description":"\u003cp\u003eమన ప్రేమల్నీ భయాల్నీ ఒంటరితనాల్నీ మూటగట్టి గతంలోకి వెళ్ళిపోయి.. గతమంటే రోజులో నెలలో కాదు, ఏళ్ళకు ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి.. ఒక ఎండాకాలపు మధ్యాహ్నంలో వదిలిపెట్టి వచ్చిన తర్వాత మనం ఏ చింతా లేకుండా బతకొచ్చనుకుంటాను.\u003c\/p\u003e\n\u003cp\u003eసమస్యంతా సరిగ్గా ఆరోజును వెతికి పట్టుకోవడమే.\u003c\/p\u003e\n\u003cp\u003eఎప్పటికైనా ఏ చింతా లేకుండా బతకలేమా అని నమ్మి ప్రేమలో పడ్డ ఒకమ్మాయి ఒకబ్బాయి కథ ఈ నవల. ఇది ఒక ఎండాకాలపు మధ్యాహ్నం జరిగే కథ కాదు. ఎవరెవరో మూటగట్టి వదిలేసి వచ్చిన ఆ మధ్యాహ్నం మోసుకొచ్చిన ఒంటరితనాల్ని జీవితమంతా మోస్తున్న ఇద్దరి కథ.\u003c\/p\u003e","brand":"V Mallikaarjun","offers":[{"title":"Default Title","offer_id":47242518364396,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/endaakalapu_madhyahnam.jpg?v=1769742410"},{"product_id":"naanigaadu","title":"నానిగాడు - Naanigaadu","description":"\u003cp\u003eకొన్ని కొన్నింటిని దాచిపెట్టుకోవడంలో ఏదో తెలియని ఆనందం దాగుంటుందనిపిస్తుంది. నా చిన్నప్పుడు మా ఇంటికి ఏ పెళ్లిపత్రిక వచ్చినా దాన్ని తీసుకెళ్లి ఒక చిన్న సీకుకి గుచ్చిపెట్టేది మా అమ్మ. ఎప్పుడైనా తీసి చూస్తే ఎవరెవరివో ఎప్పటెప్పటివో పత్రికలు కనిపించేవి. ఇవ్వాళ వాటికి నా జీవితంలో ఏ రకమైన విశేషమూ లేకపోయినా, అవి అలా ఉండేవని గుర్తుతెచ్చుకోవడం బాగుంటుంది. ఈ పుస్తకం అలాంటిదని చెప్తాను. ఏమున్నాయి. ఈ పుస్తకంలో? ఇవి కథలు కాదు, మ్యూజింగ్స్ అని కూడా చెప్పలేను. మా నానిగాడితో చెప్పుకున్న కబుర్లు, జరిపిన సంభాషణలు. అన్నీ మన రోజూవారీ మాటల్లాగే మొదలై అలాగే ముగిసేవి. మొత్తం ఇరవై ఐదు సంభాషణలు.\u003c\/p\u003e\n\u003cp\u003eమనందరిలో ఎప్పటికీ ఉండే బాల్యానికి గుర్తుగా మా నానిగాడి పుస్తకం.\u003c\/p\u003e\n\u003cp style=\"text-align: right;\"\u003e-వి. మల్లికార్జున్\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47242603561196,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/naniGadu.jpg?v=1769742476"},{"product_id":"ఇరానీ-కేఫ్-irani-cafe","title":"ఇరానీ కేఫ్ - Irani Cafe","description":"\u003cp\u003eఆగస్టు 2018. ఆంధ్రప్రదేశ్ మాస పత్రికలో నా కథ 'డ్రాఫ్ట్ బాక్స్' వస్తే అమ్మకు చూపించా. 68 పేజీల పుస్తకం అది. 50వ పేజీ నుంచి మూడు పేజీలు నా కథ ఉంది. ఊరికనే అందులో ఉన్న నా ఫొటో చూపించి ఆ పత్రికను పక్కన పడేశా. అమ్మ చదువుకోలేదు. నా ఫొటో చూసి నవ్వింది అంతే. మధ్యాహ్నం ఎప్పుడో నేను బయటికెళ్లి తిరిగొచ్చినప్పుడు ఆ పత్రికను తిరిగేస్తూ కనిపించింది. ఓపికగా ఒక్కో పేజీ తిప్పుతూ 50వ పేజీ దగ్గరికొచ్చి ఆగింది. అందులో నన్ను చూసుకొని, కాసేపు నా ఫొటో మీద చెయ్యి ఉంచి, తడిమి చూసి ఆ పత్రికను పక్కన పడేసింది. నేనెందుకు కథలు రాస్తున్నానని అడిగితే, బహుశా ఇందుకేనేమో!\u003c\/p\u003e\n\u003cp style=\"text-align: right;\"\u003e- వి. మల్లికార్జున్\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47242615849196,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/iraniCafe_8fbf708b-a3d9-4913-9b03-0e764c411421.jpg?v=1769742523"},{"product_id":"కాగితం-పడవలు-kaagitham-padavalu","title":"కాగితం పడవలు - Kaagitham Padavalu","description":"\u003cp\u003eకొన్ని కొన్ని మనకు ఎంతలా అలవాటైపోతాయంటే, అవి లేకుంటే బతకలేం. అది వ్యసనమో ఇంకొకటో. అదైతే మనతో ఉండాలంతే. అలాంటిదొకటి ప్రేమ. నేను ప్రేమించకుండా ఉండలేను. ఆ ప్రేమలే ఈ 'కాగితం పడవలు'. ఏమేమున్నాయి ఇందులో? నాకు నేను రాసుకున్న ఉత్తరాలు ఉన్నాయి. నాకు అప్పటికప్పుడు అనిపించినవి, నేను ప్రేమించిన వాళ్లకు చెప్పాలనిపించినవి (చెప్పినవీ!) రాసుకున్నాను. నేను చూసిన ప్రపంచాన్నీ పరిచయం చేయాలనుకున్నాను. వీటన్నింటికీ మించి నా ఆలోచనలను ఈ కాగితాల్లో ఎక్కించాను. అవి నాతోనే ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఎలాగోలా వాటిని వదిలెయ్యాలి. సారంగ పత్రిక నామీద వర్షంలా కురిసి, ఇక్కడో దారిని చూపించింది. బాల్యం గుర్తొచ్చింది. ఆ కాగితాలను పడవలు చేశా. ఇక్కడ వదిలేస్తున్నా. మీరు ఇదే దార్లో ఉంటే నేనే పంపించానని తెల్సుకొని, తీసుకొని అందుకోండి. చదివాక మళ్లీ వదిలెయ్యడం మర్చిపోవద్దు!\u003c\/p\u003e","brand":"V Mallikaarjun","offers":[{"title":"Default Title","offer_id":47242620895468,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/kagitham_padavalu.jpg?v=1769742545"},{"product_id":"spoorthi-manthra","title":"స్ఫూర్తి మంత్ర - Spoorthi manthra","description":"\u003cp\u003eఆలోచన రావడం గొప్పే.. కానీ దాన్ని ఆచరించడం ఇంకా గొప్ప.. గురూజీ త్రివిక్రమ్ అన్నట్లు.. క్లాస్ రూంలో ఎవరైనా సమాధానం చెబుతారు.. పరీక్షల్లో రాసేవాడే టాపర్ అవుతాడు. మనం ఏదైనా అనుకుంటే.. దాన్ని పట్టు వదలకుండా సాధించాలి. మధ్యలో ఎన్నో కష్టాలు వస్తాయి ధైర్యాన్ని కోల్పోకుండా ప్రయత్నించాలి. ఇది నేను నేర్చుకున్న తొలి పాఠం.\u003c\/p\u003e\n\u003cp\u003eనా అనుభవాలు, ఆలోచనలు, అనుభూతులు.. ఇవన్నీ ఒక రూపంలో తీసుకొచ్చినదే ఈ పుస్తకం “స్ఫూర్తి మంత్ర.” అందుకే దీని కాప్షన్ కూడా నీ ఆలోచనే.. నీ జీవితం.\u003c\/p\u003e\n\u003cp\u003eమీకు ఎన్నో ఆశయాలు, ఆలోచనలు ఉండొచ్చు వాటిని సాధించే క్రమంలో ఎన్ని అవరోధాలు రావొచ్చు.. అవన్నీ దాటుకొని ముందుకు సాగాలని.. రాముడికి ఉడతాభక్తిలా ఈ పుస్తకంలోని కొటేషన్స్ సాయంగా నిలవాలని కోరుకుంటున్నాను.\u003c\/p\u003e\n\u003cp style=\"text-align: right;\"\u003eఇట్లు మీ\u003c\/p\u003e\n\u003cp style=\"text-align: right;\"\u003eప్రవీణ్ కుమార్ ముద్దం, జర్నలిస్ట్\u003c\/p\u003e","brand":"Praveen Kumar Muddham","offers":[{"title":"Default Title","offer_id":47242627907820,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/rn-image_picker_lib_temp_2e3dd2d9-4325-4d63-ba98-98b210bce64b.png?v=1775351684"},{"product_id":"kalathapaswi","title":"కళాతపస్వి - Kalathapaswi","description":"\u003cp\u003e'కళాతపస్వి'.. ఈ పేరు వినగానే సినిమా అంటే ఇష్టపడే ఎవరికైనా ఒకే ఒక రూపం మనసులో మెదులుతుంది.. ఆయనే ప్రముఖ దిగ్గజ దర్శకుడు శ్రీ కే.విశ్వనాథ్ గారు. ఆ మహానుభావుడికి ఉన్న కోటానుకోట్ల అభిమానులలో(భక్తుడిని అంటే మరింత బాగుంటుందేమో) నేనూ ఒకడిని.. నా పేరు రాకేశ్ బొద్దుల.\u003c\/p\u003e\n\u003cp\u003eవిశ్వనాథ్ గారు తెరకెక్కించిన ఎన్నో అద్భుతమైన సినిమాలను చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంగా చూస్తున్న నాలోని అభిమానికి స్వతహాగానే రాసే అలవాటు ఉండడంతో,  ఆయన సినిమాలపై కూడా ఎందుకు మనం పుస్తకం రాయకూడదని భావించి వచ్చిన ఆలోచనే ఈ నా 'కళాతపస్వి'. విశ్వనాథ్ గారు ఆయన కథలతో చెక్కిన కళాత్మక రూపాలను నాకు తెలిసిన రీతిలో పాఠకుడి కళ్లకు కట్టినట్లుగా చెప్పే ప్రయత్నం చేశాను.. ఆయన సినిమాల ద్వారా నేర్పించిన విలువలను, సంప్రదాయపు పద్దతులను నా అక్షరాలతో ముడి వేశాను.. మొత్తంగా విశ్వనాథ్ గారి అభిమానులు మెచ్చేలా, ఆయన గౌరవం కాపాడేలా, ఆయన అనుసరించిన మార్గాన్ని పది మందికి చూపించే ప్రయత్నం చేద్దామని ఈ పుస్తక ప్రయాణం చేశాను.\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cbr\u003eకాశీనాథుని విశ్వనాథ్ గారి కళాత్మక చిత్రాలపై రాసుకున్న కళాతపస్వి పుస్తకాన్ని ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు శ్రీ తనికెళ్ల భరణి గారు ఇచ్చిన 'ముందుమాట'తో మొదలుపెట్టాను. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్రీ ఎంవీ రఘు గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసి ఈ పుస్తకాన్ని పాఠకుల చెంతకు చేర్చాను. విశ్వనాథ్ గారి కళాఖండాలకు ఏ మాత్రం విలువ తగ్గకుండా అద్భుతమైన విశ్లేషణతో పాటు అందమైన ఫోటోలను కూడా ఈ పుస్తకంలో జోడించాను. విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన పది సినిమాల్లోని అర్థాన్ని, పరమార్థాన్ని, పాటల్లో మాధుర్యాన్ని నాకు అనిపించిన రీతిలో చెప్పాలని.. ఆ చిత్రాలను తరతరాలు గుర్తుంచుకోవాలని ఈ అభిమాని చేసిన చిరు ప్రయత్నమే ఈ 'కళాతపస్వి'. చదివే ప్రతి పాఠకుడికి ఈ పుస్తకం ఖచ్చితంగా నచ్చుతుందని.. ఇది వారి ద్వారా మరింత ముందుకు వెళ్తుందని మనసారా కోరుకుంటూ... \u003c\/p\u003e\n\u003cp\u003eమీ రాకేశ్ బొద్దుల\u003c\/p\u003e","brand":"Rakesh Boddhula","offers":[{"title":"Default Title","offer_id":47267921428716,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2026-01-30at7.57.06AM_1.jpg?v=1769882492"},{"product_id":"nayana-నయన","title":"నయన - Nayana","description":"\u003cp\u003eఒక యుద్ధం తాలూకు జ్ఞాపకాల్ని మనం ఎంత వరకు మొయ్యగలం. ఇక్కడ యుద్ధమంటే కురుక్షేత్రం కాదు జీవితం. ఆ కథనరంగంలో “ప్రేమ” అనే సైనికుడు ఎదురైతే……\u003cbr\u003eఅతనితో పరిచయం పెంచుకుని పయనిస్తే…….\u003cbr\u003e ఆ మజిలీ ముగింపుకి ముందు ఆ సైనికుడితో గమ్యం లేని జ్ఞాపకంతో నిరంత యుద్ధం చెయ్యాల్సి వస్తే….\u003cbr\u003eఈ కథలో కథానాయకుడి మదిలో అలజడికి అక్షర రూపం ఇది! \u003cbr\u003eఇది చదివాక వదిలేసిన జ్ఞాపకాలను వెంట తెచ్చుకున్న మీ అనుభవాలతో బహుశా మీరు కూడా యుద్ధం చేస్తారని నా నమ్మకం!\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47473789239532,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/rn-image_picker_lib_temp_88df7d7b-7603-4409-a48d-11672d17d03a.jpg?v=1775351875"},{"product_id":"sravani-the-red-moon","title":"Sravani The Red Moon - శ్రావణి the Red Moon","description":"\u003cp\u003eప్రేమ.. స్నేహాన్ని దూరం చేసినప్పుడు..,\u003cbr\u003e \u003cbr\u003eకోల్పోయిన దానికన్నా కోల్పోయిన విధానం చిత్రవధ చేసినప్పుడు.\u003c\/p\u003e\n\u003cp\u003eకోల్పోయిన దాన్ని చూసి, వ్యవస్థలు నవ్వినప్పుడు, విలువలు లొంగినప్పుడు.., \u003c\/p\u003e\n\u003cp\u003eమితిమీరిన ప్రేమతో రాక్షసుడిగా మారినప్పుడు,\u003c\/p\u003e\n\u003cp\u003eఒక ఉత్కంఠకరమైన కథనం మొదలై,\u003cbr\u003eఅనేక మలుపులు తిరుగుతూ, ప్రతి మలుపులో ఒక అధ్యాయాన్ని లిఖిస్తూ.... అందమైన ప్రతీకారంతో మొదలై ముగిసిన క్రైమ్ కథ..!\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47474168299756,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/3dmockupimage.jpg?v=1776824099"},{"product_id":"krishna-rakakai-rukhmini","title":"Krishna Rakakai Rukhmini - కృష్ణ రాకకై రుక్మిణి","description":"\u003cp\u003e“కృష్ణ రాకకై రుక్మిణి”\u003cbr\u003eఇది ఒక ప్రేమ కథ కాదు…\u003cbr\u003eఒక భావం.\u003cbr\u003eపదాల్లో పూర్తిగా చెప్పలేని\u003cbr\u003eకొన్ని నిశ్శబ్ద అనుభూతుల ప్రయాణం.\u003cbr\u003eమన జీవితంలో ఎప్పుడో\u003cbr\u003eమనసుకు దగ్గరగా వచ్చిన\u003cbr\u003eఒక జ్ఞాపకం లాంటి కథ.\u003cbr\u003eకొన్ని ప్రశ్నలు ఉంటాయి…\u003cbr\u003eజవాబులు లేకపోయినా\u003cbr\u003eమనసులో మిగిలిపోతాయి.\u003cbr\u003eఈ పుస్తకం కూడా అలాంటిదే—\u003cbr\u003eచదివాక ముగియదు…\u003cbr\u003eమనసులో ఎక్కడో కొనసాగుతుంది.\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47511093149932,"sku":null,"price":169.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/BookImage.jpg?v=1776101507"},{"product_id":"jeevacchavam","title":"జీవచ్ఛవం - Jeevacchavam","description":"\u003cp\u003e“జీవచ్ఛవం” పుస్తకం మనిషి జీవితంలోని భావోద్వేగాలను చాలా నిజాయితీగా చూపించే కథ. ఇందులో ముఖ్యంగా సాధారణ మనుషుల జీవితాల్లో జరిగే సంఘటనలు, వారి బాధలు, ప్రేమలు, తప్పులు, మార్పులు ప్రతిబింబిస్తాయి. ఒక తల్లి తన కుమారుడిపై చూపే అపారమైన ప్రేమ, అతడు చెడు అలవాట్ల వల్ల పడే దారుణ పరిణామాలు మనసుకు తాకే విధంగా ఉంటుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eఇక యువత జీవితాన్ని చూపించే భాగాల్లో ప్రేమ, ఆకర్షణ, అహంకారం, స్నేహం వంటి భావాలు బలంగా కనిపిస్తాయి. కొంతమంది పాత్రలు ప్రేమలో అతి చేసి హింసాత్మకంగా ప్రవర్తించడం ద్వారా, ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది. అదే సమయంలో నిజమైన స్నేహం, కుటుంబ విలువలు ఎంత ముఖ్యమో కూడా తెలియజేయడం జరిగింది.\u003c\/p\u003e\n\u003cp\u003eమొత్తానికి, ఈ పుస్తకం మనిషి బ్రతికున్నప్పటికీ భావోద్వేగంగా చనిపోయినట్టుగా మారే పరిస్థితులను చూపిస్తూ, జీవితం ఎలా ఉండాలి, ఎలాంటి మార్గం ఎంచుకోవాలి అనే విషయంలో ఒక బలమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది.\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47524268376300,"sku":null,"price":169.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/jeevachavam.jpg?v=1776096426"},{"product_id":"swarganiki-daari","title":"Swarganiki Daari","description":"\u003cp\u003e   మనిషి ఒంటరిగా పుడతాడు, ఒంటరిగానే చచ్చిపోతాడు ! కానీ చావుకి పుట్టుకకి మధ్య బ్రతుకుని సాగించడానికి ప్రేమ చాలా అవసరం. తల్లిదండ్రుల ప్రేమ దొరక్కపోతే పిల్లలు ఎంత అల్లాడిపోతారో.... అలాగే జీవిత భాగస్వామి ప్రేమ దొరక్కపోయినా అంతే బాధపడతారు. అలాంటి పరిస్థితిలోనే ఉంది ఈ నవల లోనే నైషద. ఆమె ఆశించిన ప్రేమ దొరక్కపోయినా మొండిగా బ్రతికింది. ఆమె ఎప్పుడూ ఒక ఆత్మ న్యూనత భావంతో ఉండేది. అందుకు కారణం .....ఆమెకు ఏమీ చేతకాదని , ఎందుకు పనికిరాదని తన కుటుంబమే తనని అవమానించేది. ఎప్పుడూ అవమానాలు, చిత్కారాలు, వెక్కిరింపులే తప్ప ఆమెను అభిమానించిన వాళ్లు ఆమె జీవితంలో తారసపడలేదు. ఆమె చావాలని చాలాసార్లు అనుకుంది కానీ  చచ్చిపోతే వాళ్ళ మాటలు నిజం అవుతాయి. తనకి ఏమీ చేతకాదని తను ఎందుకు పనికిరాదని వాళ్ళ మాటే నిజం అవుతుందని గ్రహించి ఓర్పుతో మొండితనంతో ధైర్యంగా ముందుకు అడుగు వేసి తన జీవితాన్ని ఎలా చక్కదిద్దుకొంది అన్నదే ఈ నవల కథాంశం. నేటి సమాజంలో లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేస్తున్నారు ! అలాంటప్పుడు ఒక ఇంటి ఇల్లాలకి ఎవరైనా మర్యాద ఇస్తున్నారా  ? ఆమె ఇంటిడి చాకిరి చేసిన ఎప్పుడు ఆమెకు గౌరవం ఇవ్వరు . మరి అలాంటి ఇంటి ఇల్లాలి పరిస్థితి ఎలా ఉందో నైషద పాత్ర ద్వారా మనకు తెలుస్తుంది. ఇది కొత్త కథేమీ కాదు ! ప్రతి ఆడపిల్ల తన జీవితంలో ఇటువంటి ఎన్నో అనుభవాలను పరిస్థితులను ఎదుర్కొని ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు ! మీ ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన ఆడపిల్ల ఉండే ఉంటుంది . ఒక్కసారి అడిగి చూడండి ఆమె పడే బాధ ఏమిటో మీకు అర్థమవుతుంది.\u003c\/p\u003e","brand":"acchamga telugu","offers":[{"title":"Default Title","offer_id":47666611847404,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/swarganikidaari.jpg?v=1779775566"},{"product_id":"nenkkadidanni-నేనెక్కడిదాన్ని","title":"nenkkadidanni - నేనెక్కడిదాన్ని","description":"","brand":"acchamga telugu","offers":[{"title":"Default Title","offer_id":47669363736812,"sku":null,"price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/443c785f-24cf-49a7-9c0a-506bae621983.jpg?v=1779800439"},{"product_id":"naalaaga-endaro-నాలాగా-ఎందరో","title":"Naalaaga Endaro - నాలాగా ఎందరో","description":"","brand":"acchamga telugu","offers":[{"title":"Default Title","offer_id":47669372846316,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/e43c3f0d-4641-4296-96e4-89476e8391a5.jpg?v=1779800706"},{"product_id":"aay-maadi-narsapuramandi-ఆయ్-మాది-నర్సాపురామండి","title":"aay maadi narsapuramandi - ఆయ్ మాది నర్సాపురామండి","description":"","brand":"acchamga telugu","offers":[{"title":"Default Title","offer_id":47669376057580,"sku":null,"price":350.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/cd016c11-0ab5-436b-933f-9ade2488c5b6.jpg?v=1779801236"},{"product_id":"nine-moons","title":"Nine Moons","description":"\u003cp class=\"MsoNormal\" style=\"mso-margin-top-alt: auto; mso-margin-bottom-alt: auto; text-align: justify; line-height: 115%;\"\u003e\u003cspan style=\"font-family: 'Times New Roman',serif; mso-fareast-font-family: 'Times New Roman'; color: black; mso-font-kerning: 0pt; mso-ligatures: none; mso-fareast-language: EN-GB;\"\u003eIf you are holding this book while planning to be a mother or \u003cspan style=\"mso-spacerun: yes;\"\u003e \u003c\/span\u003epregnant, tired, emotional, excited, scared, or all of it together—this book is for you.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"MsoNormal\" style=\"mso-margin-top-alt: auto; mso-margin-bottom-alt: auto; text-align: justify; line-height: 115%;\"\u003e\u003cspan style=\"font-family: 'Times New Roman',serif; mso-fareast-font-family: 'Times New Roman'; color: black; mso-font-kerning: 0pt; mso-ligatures: none; mso-fareast-language: EN-GB;\"\u003ePregnancy is a strange miracle. Not because it is always beautiful, but because it changes you in ways you never expected. People talk about the baby growing. Few talk about \u003ci\u003eyou\u003c\/i\u003e growing, your patience, your sensitivity, your fear, your strength, your love.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"MsoNormal\" style=\"mso-margin-top-alt: auto; mso-margin-bottom-alt: auto; line-height: 115%;\"\u003e\u003cb\u003e\u003cspan style=\"font-family: 'Times New Roman',serif; mso-fareast-font-family: 'Times New Roman'; color: black; mso-font-kerning: 0pt; mso-ligatures: none; mso-fareast-language: EN-GB;\"\u003e9 Moons\u003c\/span\u003e\u003c\/b\u003e\u003cspan style=\"font-family: 'Times New Roman',serif; mso-fareast-font-family: 'Times New Roman'; color: black; mso-font-kerning: 0pt; mso-ligatures: none; mso-fareast-language: EN-GB;\"\u003e is written for the moments you don’t post.\u003cbr\u003eThe moments when you smile and worry at the same time.\u003cbr\u003eThe moments when you want reassurance, not advice.\u003cbr\u003eThe moments when you want someone to say, “What you’re feeling is normal.”\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"MsoNormal\" style=\"mso-margin-top-alt: auto; mso-margin-bottom-alt: auto; text-align: justify; line-height: 115%;\"\u003e\u003cspan style=\"font-family: 'Times New Roman',serif; mso-fareast-font-family: 'Times New Roman'; color: black; mso-font-kerning: 0pt; mso-ligatures: none; mso-fareast-language: EN-GB;\"\u003eThis book doesn’t pretend every day is magical. Some days are heavy. Some are confusing. Some are quiet victories. But all of them matter. Because every day you are becoming a mother, slowly, silently and more beautifully.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"MsoNormal\" style=\"mso-margin-top-alt: auto; mso-margin-bottom-alt: auto; text-align: justify; line-height: 115%;\"\u003e\u003cspan style=\"font-family: 'Times New Roman',serif; mso-fareast-font-family: 'Times New Roman'; color: black; mso-font-kerning: 0pt; mso-ligatures: none; mso-fareast-language: EN-GB;\"\u003eRead this book like you would talk to a friend who truly understands. Keep what helps. Skip what doesn’t. Come back whenever you need to feel steady again.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"MsoNormal\" style=\"mso-margin-top-alt: auto; mso-margin-bottom-alt: auto; line-height: 115%;\"\u003e\u003cspan style=\"font-family: 'Times New Roman',serif; mso-fareast-font-family: 'Times New Roman'; color: black; mso-font-kerning: 0pt; mso-ligatures: none; mso-fareast-language: EN-GB;\"\u003eAnd if there’s one truth this book wants to leave you with, it is this:\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"MsoNormal\" style=\"mso-margin-top-alt: auto; mso-margin-bottom-alt: auto; line-height: 115%;\"\u003e\u003cspan style=\"font-family: 'Times New Roman',serif; mso-fareast-font-family: 'Times New Roman'; color: black; mso-font-kerning: 0pt; mso-ligatures: none; mso-fareast-language: EN-GB;\"\u003eYou don’t have to be perfect to be a good mother.\u003cbr\u003eYou only have to be present.\u003cbr\u003eAnd you already are.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47670474047724,"sku":null,"price":199.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/2e2e355c-1de5-46de-95d3-11bb98ce6366.jpg?v=1779807158"}],"url":"https:\/\/www.krpublications.org\/collections\/newly-added.oembed?page=2","provider":"KR Publications","version":"1.0","type":"link"}