జంగిలి విద్యాసాగర్
నేను రచయిత, జంగిలి విద్యాసాగర్
చరిత్ర వక్రీకరణలతో, మూఢ విశ్వాసాలతో అడుగుడుగునా నిశ్యబ్ద-రాజకీయ పన్నాగాలతో, అధికార వాంఛలతో మనుషుల మధ్య అన్ని రకాల వివక్ష గోడలు నిర్మించి సమాజంలోని మనుషుల సాధారణ జీవితాలకు అజ్ఞానపు సిద్ధాంతాలను అంటగట్టిన విధానాలను చూసి, ప్రజల్లో ఆలోచనలు ప్రేరేపించడానికి, మూఢ విశ్వాసాలను పారదోలడానికి, ‘పుట్టుకతో మనుషులంతా సమానమే’ అన్న నిజాన్ని ప్రచారం చెయ్యడానికి, ప్రజల్లో అడుగంటిపోయిన ప్రశ్నించే తత్త్వాన్ని, హేతువాదపు లక్షణాలను గుర్తు చెయ్యడానికి పుస్తక రచనలను ఒక మాధ్యమముగా ఎంచుకొని రచనా రంగంలోకి అడుగు పెట్టాను…
నాకు తెలిసిన జ్ఞానాన్ని పుస్తక రూపంలో అందరితో పంచుకోవాలని నిర్ణయించుకున్నాను…