పవన్ సతీష్ నల్లం

పవన్ సతీష్ నల్లం

కథలు చెప్పాలి మాటలతో గానీ చిత్రాలతో గానీ. నా పేరు పవన్ సతీష్ నల్లం. నేను ఒక రచయిత, సినిమాటోగ్రాఫర్ కుదిరితే డైరెక్టర్ కూడా. నేను పెరిగింది, చదువుకుంది మొత్తం కాకినాడ లోనే, సినిమాల మీద ఇష్టంతో Mindscreen Film Institute లో సినిమాటోగ్రఫీ కోర్సు చేశాను.

ఈ నవల "సీతమ్మకి ఉత్తరాలు" పూర్తిగా 80s - 90s లో జరిగే కథ. ఒక పాత తెలుగు సినిమాలాంటి నవల. ఎన్నో కథలున్న ఇది మొదటి నవలగా రాయాలనిపించింది ఎందుకంటే ఇందులో 18-75 వయస్సులో జరిగే అన్ని భావాలను మీటుంది. సుమారుగా నాకు తెలిసిన ఎన్నో చిన్న చిన్న కథలు, అనుభవాలు, ఊహలు కలిపి రాసాను.