{"title":"From KR Publications Books","description":null,"products":[{"product_id":"aakhari-siraa-chukkalu","title":"ఆఖరి సిరా చుక్కలు - aakhari sira chukkalu","description":"\u003cp\u003eమరణం అనే మహాసాగరంలో మమేకం అయ్యే ముందు ఓ రచయిత తన జీవితానికి కవితా రూపం ఇచ్చి సిరాతో తన అనుభవాలు, తన అనుభూతులు, గాయాలు, జ్ఞాపకాలు పంచుకోవడమే ఈ...\u003c\/p\u003e\n\n\u003cp style=\"text-align: right;\"\u003e \u003cstrong\u003eనా ఆఖరి సిరా చుక్కలు.\u003c\/strong\u003e\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47024515186924,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/aakhari_sira_chukkalu.jpg?v=1764177073"},{"product_id":"vruddhasramam","title":"వృద్ధాశ్రమం - vruddhasramam","description":"\u003cp style=\"text-align: center;\"\u003eఈ భూమి మీద ఎవ్వరూ శాశ్వతం కాదు,\u003cbr\u003e భూమి మాత్రమే శాశ్వతం.\u003cbr\u003e నువ్వు డబ్బు సంపాదించి ఎంత గొప్పగా బ్రతికినా\u003cbr\u003e ఊరు చివర నీ శరీరం కోసం స్మశానం ఎదురు చూస్తూనే ఉంటుంది.\u003cbr\u003e నీ చావుకి సమయం రానంత వరకు\u003cbr\u003e ఈ భూమి మీద నువ్వు ఎన్ని నాటకాలు వేసినా చెల్లేది.\u003cbr\u003e నాలో ఉన్న ఆశయాలు, ఆలోచనలు\u003cbr\u003e సముద్రంలో తుఫాన్ వలె సమాజంపై విరుచుకుపడుతున్నప్పుడు\u003cbr\u003e ఎవ్వరైనా సరే అడ్డుకోవడానికి ప్రయత్నించే\u003cbr\u003e ఆ అలల తాకిడికి కొట్టుకుపోతారు.\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47027477315820,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/vriddhasramam.jpg?v=1764177787"},{"product_id":"sitha-sametha-raama","title":"సీతా సమేత రామ - Sitha Sametha Rama","description":"\u003cp class=\"PlaygroundEditorTheme__paragraph\" dir=\"ltr\"\u003e\"వర్షం తర్వాత చెప్పులకు అంటిన బురద చూసి చిరాకు పడే మనుషుల మధ్య,\n తడిసిన మట్టి ఇచ్చే సువాసనలో ఆనందం వెతికేలా రాసిన కథ.\"\u003c\/p\u003e\n\n \u003cp class=\"PlaygroundEditorTheme__paragraph\" dir=\"ltr\"\u003e\u003cspan\u003eఇతరులకి చెప్పేటంత పెద్దదాన్ని కాదు. అలా అని నిజాన్ని చెప్పకుండా దాచిపెట్టే రకంకూడా కాదు. \"ప్రేమ చచ్చిపోయి, పాపాలు పెరిగిన ప్రపంచంలో.. పెరుగుతూ వస్తున్న ఆడపిల్లని..\". మనసుకి ఎంత వద్దు అనిపించినా, పెళ్లిచేసుకుని మరొకరి జీవితంలోకి వెళ్లక తప్పదు అని తెలుసు. నేను మాత్రమే కాదు, నాలాంటి ఎందరో అమ్మాయిలు కావాలనుకునే ఒక చిన్న ప్రేమ కథ.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\n \u003cp class=\"PlaygroundEditorTheme__paragraph\" dir=\"ltr\"\u003e\u003cspan\u003e\"తల్లిదండ్రుల తగువుల్లో, ప్రస్తుత కాలపు ప్రేమల మధ్య మౌనంగా మారిపోయిన ప్రతి మనసుకి ప్రేమని మళ్ళీ పరిచయం చేస్తూ... ఓదార్పుగా నిలిచిన కథ – సీత సమేత రామ\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47029187346668,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-11-27at1.02.19AM.jpg?v=1764185617"},{"product_id":"kala-kathalu","title":"కళ కథలు - Kala Kathalu","description":"\u003cp style=\"text-align: center;\"\u003eవెతికితే తట్టే కథలు వేరు,\u003cbr\u003eవెతుక్కుంటూ వచ్చే కథలు వేరు. \u003cbr\u003eఈ కథలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. \u003cbr\u003eనాకు తోచినట్లు కాకుండా వాటిని తలుచుకుంటూ రాయమని అడిగాయి.\u003cbr\u003eకవితలతో మూడు పుస్తకాలకి నాంది పలికిన నా కలాన్ని \u003cbr\u003eఈసారి ఇలా కథల కోసం కదలించాను. \u003cbr\u003eకథ రాయడం ఒక కళ అని భావించి \u003cbr\u003e'కళ కథలు' గా నామకరణం చేశాను.\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47074586657004,"sku":null,"price":169.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-12-07at9.00.22PM.jpg?v=1765165427"},{"product_id":"seethammaki-vuttharaalu","title":"సీతమ్మకి ఉత్తరాలు - Seethammaki Vuttharaalu","description":"\u003cp\u003eసూర్య-దేవి అనే దంపతులు అనుకోని పరిస్థితుల్లో ఓ పరాయి ఇంట్లో నివసించాల్సి వస్తుంది. ఆ ఇంటి తోటలో ఉన్న ఒక సమాధి దగ్గర, తన జీవితంలో చెప్పుకోలేకపోయిన అనుభూతులు, పశ్చాత్తాపాలు తన భార్య సీతమ్మకు రాసి పెట్టిన రామన్న కథే ఈ “సీతమ్మకు ఉత్తరాలు.”\u003c\/p\u003e\n\u003cp\u003eఈ నవల పూర్తిగా 80s-90s కాలానికి చెందినది- ఒక పాత తెలుగు సినిమా చూసినట్టుగా, గుండె లోతుల్లోకి దిగే కథ. 18 నుండి 75 ఏళ్ల వరకు మనిషి అనుభవించే అన్ని భావాల్ని తాకే ఈ కథను మొదటి నవలగా రాయాలని అనిపించింది. ఎందుకంటే ఇందులో నాకు వ్యక్తిగతంగా తెలిసిన చిన్న చిన్న కథలు, అనుభవాలు, జ్ఞాపకాలు, ఊహలు అన్ని జోడించి రాశాను.\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47083854069996,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/image-36_1.png?v=1765455478"},{"product_id":"manalone-srinivasu","title":"మనలోనే శ్రీనివాసు - Manalone Srinivasu","description":"\u003cp\u003eసప్తధార ఏడు పుస్తకాల కలయిక ఏడు పాత్రల కదలిక. ప్రతీ కోణంలో ఒక కథ పురుడు పోసుకుంటుంటే, ప్రతీ కథలో కొత్త కోణాలు వెలువడుతూ ఉంటాయి. \u003cbr\u003eపాత్రల తాలూకా కొలమానాలు సంగతి పాఠకులకి వదిలేస్తూ వాటి మధ్య జరిగే సంఘర్షణలు, సంభాషణలు నేను పూరిస్తూ, ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతున్నాను.\u003c\/p\u003e","brand":"Kondal Rao Addagalla","offers":[{"title":"Default Title","offer_id":47097599262956,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-12-12at5.13.24PM.jpg?v=1765540152"},{"product_id":"bhumini-nenu","title":"భూమిని నేను - Bhumini nenu","description":"\u003cp style=\"text-align: left;\"\u003e\"ప్రేమలేక మిగిలిపోయిన ప్రేమలేఖను నేను!\"\u003cbr\u003eఈ ఒక్క వాక్యంలోనే స్త్రీ ఆంతరంగిక ప్రపంచం ఉంది. \u003cbr\u003eప్రేమించి భంగపడిన మానని గాయాలు ఉన్నవి.\u003cbr\u003eభూ కంపాలను రిక్టర్ స్కేల్ తో కొలుస్తున్నాం,\u003cbr\u003eమరి పగుళ్లొచ్చిన స్త్రీ హృదయాన్ని ఏం పరికరాలతో కొలుస్తాం? \u003cbr\u003eకొలవడం మాట అటుంచితే వాళ్ళ బాధను అర్థం చేసుకుంటున్నామా? \u003cbr\u003eఇలాంటి రచనలు వచ్చినపుడు ఆమె కూడా మనలాంటి మనిషే అని తెలుసుకుంటాం.\u003cbr\u003eమనలోపలి ఆధిపత్యాలను తుంచి వేసుకుంటాం.\u003cbr\u003e\u003cbr\u003e“Bhoomi ni Nenu” is a unique literary work that reflects human emotions through the voice of the Earth. In some parts, the Earth speaks like a mother; in others, she takes the form of a girl, responding to social issues, emotions, and experiences.\u003cbr\u003eThis launch event will include a brief reading session, author interaction, and a discussion on the inspiration behind the book and its message.\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Sunka Dharani","offers":[{"title":"Default Title","offer_id":47128204935404,"sku":null,"price":129.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-12-18at3.57.47PM_1.jpg?v=1766068434"},{"product_id":"macchuki-manasu-palikina-padhahaaru-kathalu","title":"మచ్చుకి -  మనసు పలికిన పదహారు కథలు - macchuki manasu palikina padhahaaru kathalu","description":"\u003cp\u003eమచ్చుకి – \"మనసు పలికిన పదహారు కథలు\"— ఈ పుస్తకం నా జీవితంలో దాగి ఉన్న కొన్ని నవ్వులు, కొన్ని బాధలు, కొన్ని నిశ్శబ్దాలు...\u003c\/p\u003e\n\u003cp\u003eఇంకా నాకు నేర్పిన అనేక అనుభవాల నుంచి పుట్టినవి.\u003c\/p\u003e\n\u003cp\u003eఈ పదహారు కథలలో ప్రతి ఒక్కటి, నేను చూసిన మనుషులు, వారి ప్రయాణాలు, పడిపోయిన సందర్భాలు, లేచిన క్షణాలు, మాటల్లో పెట్టలేని భావాలతో నిండిపోయి ఉంటాయి.\u003c\/p\u003e\n\u003cp\u003e- పడిపోవడం తప్పు కాదు. పడి లేవకుండా ఉండడం తప్పు.\u003c\/p\u003e\n\u003cp\u003eఅదే నిజం నాకు నేర్పిన ప్రతి సంఘటన, ప్రతి గాయం, ప్రతి చిరునవ్వు... ఈ కథల రూపంలో మీ ముందుకు వచ్చాయి.\u003c\/p\u003e\n\u003cp\u003eనా ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది – ఈ కథలు నాకిచ్చిన ధైర్యం, మీకూ ఇవ్వాలని మాత్రమే నా ఆశ. ఈ పుస్తకంలో ఉన్న ఏదో ఒక వాక్యం... ఏదో ఒక క్షణం...\u003c\/p\u003e\n\u003cp\u003eమీలోని మౌనాన్ని పలకరించి, మీ జీవితానికి కొద్దిగా వెలుగు నింపితే-ఈ పుస్తకం పుట్టిన ప్రయాణానికి అప్పుడు నిజమైన అర్థం దొరికినట్టే.\u003c\/p\u003e\n\u003cp\u003eమణికంఠ శంకు AJ :)\u003c\/p\u003e","brand":"Manikanta Sanku","offers":[{"title":"Default Title","offer_id":47134178115820,"sku":null,"price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/WhatsAppImage2025-12-22at12.06.14AM.jpg?v=1766381119"},{"product_id":"nayana-నయన","title":"నయన - Nayana","description":"\u003cp\u003eఒక యుద్ధం తాలూకు జ్ఞాపకాల్ని మనం ఎంత వరకు మొయ్యగలం. ఇక్కడ యుద్ధమంటే కురుక్షేత్రం కాదు జీవితం. ఆ కథనరంగంలో “ప్రేమ” అనే సైనికుడు ఎదురైతే……\u003cbr\u003eఅతనితో పరిచయం పెంచుకుని పయనిస్తే…….\u003cbr\u003e ఆ మజిలీ ముగింపుకి ముందు ఆ సైనికుడితో గమ్యం లేని జ్ఞాపకంతో నిరంత యుద్ధం చెయ్యాల్సి వస్తే….\u003cbr\u003eఈ కథలో కథానాయకుడి మదిలో అలజడికి అక్షర రూపం ఇది! \u003cbr\u003eఇది చదివాక వదిలేసిన జ్ఞాపకాలను వెంట తెచ్చుకున్న మీ అనుభవాలతో బహుశా మీరు కూడా యుద్ధం చేస్తారని నా నమ్మకం!\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47473789239532,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/rn-image_picker_lib_temp_88df7d7b-7603-4409-a48d-11672d17d03a.jpg?v=1775351875"},{"product_id":"sravani-the-red-moon","title":"Sravani The Red Moon - శ్రావణి the Red Moon","description":"\u003cp\u003eప్రేమ.. స్నేహాన్ని దూరం చేసినప్పుడు..,\u003cbr\u003e \u003cbr\u003eకోల్పోయిన దానికన్నా కోల్పోయిన విధానం చిత్రవధ చేసినప్పుడు.\u003c\/p\u003e\n\u003cp\u003eకోల్పోయిన దాన్ని చూసి, వ్యవస్థలు నవ్వినప్పుడు, విలువలు లొంగినప్పుడు.., \u003c\/p\u003e\n\u003cp\u003eమితిమీరిన ప్రేమతో రాక్షసుడిగా మారినప్పుడు,\u003c\/p\u003e\n\u003cp\u003eఒక ఉత్కంఠకరమైన కథనం మొదలై,\u003cbr\u003eఅనేక మలుపులు తిరుగుతూ, ప్రతి మలుపులో ఒక అధ్యాయాన్ని లిఖిస్తూ.... అందమైన ప్రతీకారంతో మొదలై ముగిసిన క్రైమ్ కథ..!\u003c\/p\u003e","brand":"KR Publications","offers":[{"title":"Default Title","offer_id":47474168299756,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/3dmockupimage.jpg?v=1776824099"}],"url":"https:\/\/www.krpublications.org\/te\/collections\/from-kr-publications-books.oembed","provider":"KR Publications","version":"1.0","type":"link"}