Kalpana Bandaru
నాకు చిన్నప్పటి నుంచి కథలు అంటే చాలా ఇష్టం. నేను ఒక సాధారణమైన హౌస్ వైఫ్ ని . ఇంట్లో ఉండి చేయగలిగే పని ఏదైనా ఉందా అని ఆలోచిస్తూ ఆడియో స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ పెట్టాను . వేరే రచయితల నవలలు చదువుతూ ఉండేదాన్ని..... అలాంటప్పుడు నేను ముందే డిస్క్లైమెర్ ఇచ్చే దాన్ని , వేరే వాళ్ళ రచనలు కేవలం నేను చదివి వినిపిస్తున్నాను అని . అయినా సరే ఒక రచయిత నా మీద కాపీ రైట్ వేశారు . అప్పుడు చాలా కోపం, బాధ కలిగాయి. ఆ కోపం బాధలోంచి నేను ఎందుకు కథ రాయకూడదు అన్న ఆలోచన పుట్టింది. మెల్లగా కథలు రాయడం మొదలు పెట్టాను .అలా ఇప్పటికీ 9 కథలు రాశాను ఆ కథలు రాసేటప్పుడు నా సామర్థ్యం ఏంటో నాకు తెలిసింది. నవల రాయగలనని అనిపించింది. అందుకే ఆ ప్రయత్నానికి ఫలితమే ఈ 'స్వర్గానికి దారి' నవల. ఇన్నేళ్లు నేను చేసింది ఏమీ లేదు. నా కెరీర్ ఇప్పుడే మొదలైంది చాలా లేటుగా.......
బహుశా నేను ఏం చేయగలనో తెలుసుకోవడానికి నాకు 39 ఏళ్లు పట్టింది. అయినా పరవాలేదు లేటుగా అయినా సరే నేను ఏం చేయగలనో నాకు అర్థం అయింది . its never too late to begin your career 😊