{"product_id":"కాగితం-పడవలు-kaagitham-padavalu","title":"కాగితం పడవలు - Kaagitham Padavalu","description":"\u003cp\u003eకొన్ని కొన్ని మనకు ఎంతలా అలవాటైపోతాయంటే, అవి లేకుంటే బతకలేం. అది వ్యసనమో ఇంకొకటో. అదైతే మనతో ఉండాలంతే. అలాంటిదొకటి ప్రేమ. నేను ప్రేమించకుండా ఉండలేను. ఆ ప్రేమలే ఈ 'కాగితం పడవలు'. ఏమేమున్నాయి ఇందులో? నాకు నేను రాసుకున్న ఉత్తరాలు ఉన్నాయి. నాకు అప్పటికప్పుడు అనిపించినవి, నేను ప్రేమించిన వాళ్లకు చెప్పాలనిపించినవి (చెప్పినవీ!) రాసుకున్నాను. నేను చూసిన ప్రపంచాన్నీ పరిచయం చేయాలనుకున్నాను. వీటన్నింటికీ మించి నా ఆలోచనలను ఈ కాగితాల్లో ఎక్కించాను. అవి నాతోనే ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఎలాగోలా వాటిని వదిలెయ్యాలి. సారంగ పత్రిక నామీద వర్షంలా కురిసి, ఇక్కడో దారిని చూపించింది. బాల్యం గుర్తొచ్చింది. ఆ కాగితాలను పడవలు చేశా. ఇక్కడ వదిలేస్తున్నా. మీరు ఇదే దార్లో ఉంటే నేనే పంపించానని తెల్సుకొని, తీసుకొని అందుకోండి. చదివాక మళ్లీ వదిలెయ్యడం మర్చిపోవద్దు!\u003c\/p\u003e","brand":"V Mallikaarjun","offers":[{"title":"Default Title","offer_id":47242620895468,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0797\/5534\/6156\/files\/kagitham_padavalu.jpg?v=1769742545","url":"https:\/\/www.krpublications.org\/te\/products\/%e0%b0%95%e0%b0%be%e0%b0%97%e0%b0%bf%e0%b0%a4%e0%b0%82-%e0%b0%aa%e0%b0%a1%e0%b0%b5%e0%b0%b2%e0%b1%81-kaagitham-padavalu","provider":"KR Publications","version":"1.0","type":"link"}