భావన శంకరాణ

భావన శంకరాణ

అందరికి నమస్కారం,

సంవత్సరం క్రితం బీటెక్ మొదటి సంవత్సరంలో మాములుగా రాసుకున్న చిన్న కథ "ప్రపంచం చిన్నది అలియాస్ ఈ సీతా సమేత రామ". అప్పుడు నా చుట్టూ నేను చూస్తూ పెరిగిన సంగతులను గురించి చెప్తూ.. చిన్నగా ప్రేమను కలిపి రాసిన ఈ కథ ఇంస్టాగ్రామ్ పోస్ట్ గా పెట్టినప్పుడు నాకు తెలీదు.. ఈ కథని ఇష్టపడే వారు ఉన్నారని. కథని ఇష్టపడి, "చాలా బాగా రాసారు" అని వాళ్లు చెప్పిన మాటలు, చూపిన ప్రేమ, నాకు ఇలా నా మొదటి పుస్తకంగా పూర్తి చెయ్యడానికి ప్రేరణగా, ఆధారంగా మారాయి. ఈ కథ మీకు ఏమైనా నేర్పిస్తుందా..! అన్నది నాకు తెలీదు.. కానీ, కచ్చితంగా ఈ కథ మీతో చాలా మాట్లాడుతుంది అని మాత్రం చెప్పగలను.

“ఈ కథలోని మాటలు… కొందరిని అర్థం చేసుకుంటాయి, మరికొందరికి అర్థమయ్యేలా మారుతాయి…”

చివరిగా ఈ పంతొమ్మిదేళ్ల అమ్మాయి.. పరిచయం చేసిన పాత్రలు సీతారాములు అలాగే సీతా సమేత రామ పుస్తకం, మీకు నచ్చుతాయని ఆశిస్తూ....

ఇట్లు మీ Ms_Unknown_Writer,
భావన శంకరాణ.

From భావన శంకరాణ