విద్యాసాగర్ యాసరవేణి

విద్యాసాగర్ యాసరవేణి

నేను మీ విద్యా సాగర్ యాసరవేణి ...సమాజంలో వున్న అసమానతలు అన్యాయలను దోపిడి వ్యవస్థలను,నీచమైన రాజకీయాలను కుటిల నీతి చేష్టలను చూడలేక రక్తం ఉడికి ఉడికి లావాగా మారి గన్ను పట్టుకొని ఒక్కో సమస్యను జవాబు ఇవ్వాలని అనుకున్న కాని అది చట్టరీత్యా నేరం కాబట్టి..గన్నుకు బదులు,పెన్ను పట్టుకున్న..ఒక్క సిరా చుక్క లక్ష మెదల్లకూ కదలిక అనే నినాదంతో ముందుకు వెళుతున్న...మనం రాసే ప్రతి అక్షరం సమాజానికి మంచి చెయ్యాలి.లేదా సమాజంలో వున్న సమస్యను ఎత్తి చూపలి..లేదా ఆశలు ఆవిరి అయినా బతుకులకు కాస్తా నమ్మకాన్ని చూపించాలి లేకపోతే ఆ అక్షరాలకు విలువ ఏముంది...ఆ అక్షరాల అవసరం ఏముంది.......బానిసత్వం నాటిన ప్రతి గడ్డ మీద ఉద్యమాలు అనే వెదురు వనాలు పుడుతాయి ......ఆ ఉద్యమాలకు పురుడు పోసె అక్షరాలలో నాది ఒక అక్షరం ఎప్పుడు వుంటుంది......రవి ఉదయాన్ని కవి అక్షరాలని ఎవరూ ఆపలేరు...రవి కి చావు లేదు...కవిని చావు చంపలేదు.

From విద్యాసాగర్ యాసరవేణి