అగ్గి రాతలు - aggiraathalu
అగ్గి రాతలు - aggiraathalu
ఈ నా పుస్తకం...
నా కపాల గూడులో జరిగిన యుద్దంలో నుంచి
పుట్టిన పురిటి బిడ్డ...
నాలో ఆవేశానికి ఆక్రోశానికి మధ్యలో రగిలిన
అగ్ని కణం..
వ్యవస్థలు అవస్థలు పడుతుంటే..
అసమానతలు అడుగడుగునా అక్కసు కక్కుతుంటే
అంధకారం కళ్ళ నిండా కుక్కుకొని..
అందంగా ఆనందంగా జీవిస్తున్నాం...
బద్దకపు, అబద్ధపు బ్రతుకు బతుకుతున్నాం..
కుల మత రొచ్చులు
మనిషి మనిషికీ మధ్య జరిగే చిచ్చులు
అంటరానితనాన్ని పెంచి పోషించే శక్తులు...
ఆడపిల్లల్ని ఆగాదంలోకి తోసే కుయుక్తులు..
అన్ని చూసి...
నా కోప తుఫాన్ నుంచి కొట్టుకొచ్చిన పుస్తకం..
నా వేదన వడగండ్ల నుంచి ఉబికి వచ్చిన పుస్తకం..
నా గుండె గాండ్రింపు గాలి నుంచి జన్మించిన పుస్తకం..
అగ్గి లాంటి నిజాలు బుగ్గి కాకుండా..
బరువెక్కిన హృదయంతో.. బాధతో రాస్తున్న పుస్తకం...
ఈ నా అగ్గిరాతలు... మన తలరాతలను మార్చే రాతలు..
- విద్యాసాగర్ యాసరవేణి
In stock
Couldn't load pickup availability
