వృద్ధాశ్రమం - vruddhasramam
వృద్ధాశ్రమం - vruddhasramam
ఈ భూమి మీద ఎవ్వరూ శాశ్వతం కాదు,
భూమి మాత్రమే శాశ్వతం.
నువ్వు డబ్బు సంపాదించి ఎంత గొప్పగా బ్రతికినా
ఊరు చివర నీ శరీరం కోసం స్మశానం ఎదురు చూస్తూనే ఉంటుంది.
నీ చావుకి సమయం రానంత వరకే
ఈ భూమి మీద నువ్వు ఎన్ని నాటకాలు వేసినా చెల్లేది.
నాలో ఉన్న ఆశయాలు, ఆలోచనలు
సముద్రంలో తుఫాన్ వలె సమాజంపై విరుచుకపడుతున్నప్పుడు
ఎవ్వరైనా సరే అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే
ఆ అలల తాకిడికి కొట్టుకుపోతారు.
In stock
Couldn't load pickup availability

వృద్ధాశ్రమం - vruddhasramam Details
వృద్ధాశ్రమం
ఈ పుస్తకం ప్రతి ఒక్కరు చదవాలని కోరుకుంటున్నాను.
మనలోని మానవత్వం ఏ స్థాయికి చేరుకుందో తెలుస్తుంది.
సమాజంలో వచ్చే మార్పు ఓ చరిత్రకు శ్రీకారం కావాలి.
మా ఉపాధ్యాయురాలు నాకు ఫోన్ చేసి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ద్వారా మిమ్మల్ని మళ్ళీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈమధ్య నా ఆరోగ్యం బాగోవడం లేదు, గుండెల్లో దడగా ఆందోళనగా అనిపిస్తుంది అమ్మ, నీతో మాట్లాడక కొంచెం బాగుంది. ఏం అనుకోకపోతే కొంత సమయం నాకోసం ఇవ్వగలవా,
ప్రతిరోజు ఫోన్ చేసి కొంచెం నాతో మాట్లాడుతూ ఉండమ్మా
అని అని అడిగారు. చాలా బాధగా అనిపించింది.
అయినవాళ్లు ఉండి కూడా ఇలా ఒంటరిగా ఎంతమంది బాధపడుతున్నారో.....
ఇలాంటప్పుడు అనిపిస్తుంది. బంధాలు బంధుత్వాలు ఏ స్థాయిలో ఉన్నాయో అని,
మన వాళ్ల కోసం మనం ఇవ్వగలిగింది కొంత సమయం మాత్రమే.
మనం సంపాదించుకోగలిగినది వారితో గడిపిన కొంత కాలం మాత్రమే.
మనలో ఉండవలసిన లక్షణాలు
ప్రేమా ,జాలీ ,దయ ,నమ్మకం, నిజాయితీ
ఇవే మన ఉనికిని సూచిస్తాయి.
ఇవి లేకపోతే చలనం లేని వాటికి మనకు పెద్ద తేడా ఉండదు.
మనుషులం మనుషులుగా మారాలి మృగాలుగా కాదు.
ఉత్తరాల నుండి చేతిలో స్మార్ట్ ఫోన్ తో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ కాలంలో ఉండి మనం అనాధలుగా మారిపోతున్నాం.
ప్రకాష్ అన్నయ్యా
వృద్ధాశ్రమం బుక్ చాలా బాగుంది
ఎంత బాగుందంటే ఏడిపించేసారు
చందు తన అజ్ఞానపు గ్రహణం వీడి మార్పు అనే పున్నమి వెలిసేలోపు వాళ్ళ నాన్న చనిపోవడం
కృంగిపోకుండా మరెవరికీ అలాంటి పరిస్థితి రాకూడదని అందరినీ వారి కుటుంబాలకు చేర్చడం
మీరు ఎందుకు ఆ పాత్రకి చందు అని పేరు పెట్టారో తెలియదు కానీ తను మాత్రం చీకటిమయమైన జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రుడే.
చందు లాగే అందరూ గ్రహణాన్ని వీడితే
కష్టాల చీకట్లో కాలమెల్లదీస్తున్న తల్లిదండ్రుల జీవితాలు బాగుపడతాయి
మీరు కోరుకున్న వృద్ధాశ్రమం లేని సమాజం త్వరలోనే వస్తుంది
గోపి మూగవేదన కళ్ళకు కట్టినట్లు చూపించారు
ఇక అంతా అయిపోయింది తను సొంతింటికి చేరబోతున్నాడు అనుకునేలోపు చనిపోవడం చాలా బాధాకరం
ఏదైతేనేం వృద్ధాశ్రమం లేని సమాజం కోసం
మీ ప్రయత్నం అభినందనీయం
మీ పుస్తకం అద్భుతం.....ఏముల అంజలి ✍️
నేను చాలా పుస్తకాలు చదవకపోయినా… చదివిన వాటిలో నాకు పూర్తిగా కొత్త అనుభూతి ఇచ్చిన పుస్తకం “వృద్ధాశ్రమం”. ఈ పుస్తకం నాకు కొత్త ఆలోచనలు, కొత్త ప్రశ్నలు, కొత్త బాధ్యతలను తెలియజేసింది.
“పెదవేగి సత్యప్రకాష్” గారు వృద్ధుల మనసులో దాగి ఉన్న నొప్పిని, వారు బయట చూపించలేని బాధలను అద్భుతంగా మన కళ్లముందు ఉంచారు.
వృద్ధాశ్రమంలో ఉండే ప్రతి తల్లి–తండ్రి వెనుక ఎంత ప్రేమ, ఎంత త్యాగం, ఎంత మమత ఉందో… ఆయన రాతలో స్పష్టంగా కనిపిస్తుంది.
ఒక తండ్రి తన కొడుకు కోసం చేసే త్యాగం, అతడిపై ఉన్న అనురాగం—అన్నిటిని నిజజీవితంలో చూసినట్టుగా మన ముందుకు తీశారు.
అంత ప్రేమను ఇచ్చిన తల్లిదండ్రులు చివరికి ఎందుకు వృద్ధాశ్రమం చేరుతారు?
ఆ కొడుకు మనసు ఎలా మారుతుంది?
ఆ మార్పుకు కారణమెవరు?
ఇవన్నీ మన హృదయాన్ని తాకేలా, ఆలోచింపజేసేలా రాశారు.
మన జీవితాల్లో మార్పులు ఎలా వచ్చినా—కొన్ని పరిచయాలు, కొన్ని సంఘటనలు, కొన్ని ప్రదేశాలు మన మనసును మార్చుతాయి.
అలాంటి ఎన్నో సరికొత్త ఆలోచనలతో “వృద్ధాశ్రమం” పుస్తకం మన ముందుకు వచ్చింది.
పెదవేగి సత్యప్రకాష్ గారి జీవిత లక్ష్యం ఒక్కటే—
వృద్ధాశ్రమాలే అవసరం లేని సమాజాన్ని నిర్మించడం.
తల్లిదండ్రులు ప్రేమ కోసం, భద్రత కోసం ఎప్పుడూ వేరే చోట ఆశ్రయం కోరాల్సిన పరిస్థితి రాకుండా ఉండే ప్రపంచం సృష్టించడం.