పెదవేగి సత్యప్రకాష్

పెదవేగి సత్యప్రకాష్

అందరికీ నమస్కారం ఆండీ.. నా పేరు పెదవేగి సత్య ప్రకాష్. వృద్ధాశ్రమం అనే పుస్తకాన్ని రచించిన రచయితను నేను. ఈ సాహిత్య రంగంలో చిన్న చిన్న కవితలగా మొదలుపెట్టిన నా ఈ ప్రయాణం ఈ రోజు ఒక పుస్తకాన్ని రచించి మీ ముందుకు తీసుకువచ్చేలా చేసింది. నాలో నా రచనల్లో ఈ సమాజానికి ఏదోకటి చెయ్యాలి అనే తాపత్రయం ఎక్కువుగా కనిపిస్తూ వుంటుంది. రచయితగా నా ఆలోచన ఎప్పటికీ ఒక్కటే. నా రచనలు, కవితలు, నవలలు చదివిన వాళ్ళల్లో ఒక్కరూ మారిన నేను ఈ రంగంలో గెలిచినట్టే. నన్ను మరింత ఆదరించి ముందుకు తీసుకెళ్తారనీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చదివిన నా పుస్తకానికి మీ విలువైన సలహాలు ఇవ్వగలరని మరీ మరీ కోరుకుంటున్నాను.

పెదవేగి సత్యప్రకాష్ నుండి