వృద్ధాశ్రమం - vruddhasramam
వృద్ధాశ్రమం - vruddhasramam
ఈ భూమి మీద ఎవ్వరూ శాశ్వతం కాదు,
భూమి మాత్రమే శాశ్వతం.
నువ్వు డబ్బు సంపాదించి ఎంత గొప్పగా బ్రతికినా
ఊరు చివర నీ శరీరం కోసం స్మశానం ఎదురు చూస్తూనే ఉంటుంది.
నీ చావుకి సమయం రానంత వరకు
ఈ భూమి మీద నువ్వు ఎన్ని నాటకాలు వేసినా చెల్లేది.
నాలో ఉన్న ఆశయాలు, ఆలోచనలు
సముద్రంలో తుఫాన్ వలె సమాజంపై విరుచుకుపడుతున్నప్పుడు
ఎవ్వరైనా సరే అడ్డుకోవడానికి ప్రయత్నించే
ఆ అలల తాకిడికి కొట్టుకుపోతారు.
అందుబాటులో ఉంది
పికప్ లభ్యతను లోడ్ చేయడం సాధ్యం కాలేదు.

వృద్ధాశ్రమం - vruddhasramam వివరాలు
నేను చాలా పుస్తకాలు చదవకపోయినా… చదివిన వాటిలో నాకు పూర్తిగా కొత్త అనుభూతి ఇచ్చిన పుస్తకం “వృద్ధాశ్రమం”. ఈ పుస్తకం నాకు కొత్త ఆలోచనలు, కొత్త ప్రశ్నలు, కొత్త బాధ్యతలను తెలియజేసింది.
“పెదవేగి సత్యప్రకాష్” గారు వృద్ధుల మనసులో దాగి ఉన్న నొప్పిని, వారు బయట చూపించలేని బాధలను అద్భుతంగా మన కళ్లముందు ఉంచారు.
వృద్ధాశ్రమంలో ఉండే ప్రతి తల్లి–తండ్రి వెనుక ఎంత ప్రేమ, ఎంత త్యాగం, ఎంత మమత ఉందో… ఆయన రాతలో స్పష్టంగా కనిపిస్తుంది.
ఒక తండ్రి తన కొడుకు కోసం చేసే త్యాగం, అతడిపై ఉన్న అనురాగం—అన్నిటిని నిజజీవితంలో చూసినట్టుగా మన ముందుకు తీశారు.
అంత ప్రేమను ఇచ్చిన తల్లిదండ్రులు చివరికి ఎందుకు వృద్ధాశ్రమం చేరుతారు?
ఆ కొడుకు మనసు ఎలా మారుతుంది?
ఆ మార్పుకు కారణమెవరు?
ఇవన్నీ మన హృదయాన్ని తాకేలా, ఆలోచింపజేసేలా రాశారు.
మన జీవితాల్లో మార్పులు ఎలా వచ్చినా—కొన్ని పరిచయాలు, కొన్ని సంఘటనలు, కొన్ని ప్రదేశాలు మన మనసును మార్చుతాయి.
అలాంటి ఎన్నో సరికొత్త ఆలోచనలతో “వృద్ధాశ్రమం” పుస్తకం మన ముందుకు వచ్చింది.
పెదవేగి సత్యప్రకాష్ గారి జీవిత లక్ష్యం ఒక్కటే—
వృద్ధాశ్రమాలే అవసరం లేని సమాజాన్ని నిర్మించడం.
తల్లిదండ్రులు ప్రేమ కోసం, భద్రత కోసం ఎప్పుడూ వేరే చోట ఆశ్రయం కోరాల్సిన పరిస్థితి రాకుండా ఉండే ప్రపంచం సృష్టించడం.