సాంగత్య - Saangathya

సాంగత్య - Saangathya

కళలు చాలా గొప్పవి! అవి అందరినీ అన్వయించవు. కలం పట్టి కాగితం మీద రాయటం బహుశా ఆ దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం కంటే అవకాశంగా భావిస్తాను. ఎందుకంటే అక్షరం నడవకపోయినా, శబ్దం వినిపించకపోయినా ప్రపంచం స్తంభించిపోతుంది అంటారు.
ఒక రచయితగా ఈ సమాజానికి సందేశాన్ని సంధించడం కంటే నిజాన్ని నిర్భయంగా చెప్పడం నాకు ఇష్టం! ఎందుకంటే మన కర్మని క్రమం తప్పకుండా చెయ్యటమే ఈ సమాజానికి సంధించే నిజమైన సందేశం అని నేను నమ్ముతాను.
కోట్ల అక్షరాల్ని లక్షల పదాలని వేల వాక్యాలని ఒక పుస్తకంలో నింపడానికి ఒక రచయిత పడే కష్టం అనర్గళం అనితర సాధ్యం! ఈ మాట ఎందుకు అన్నాను అంటే కురుక్షేత్ర యుద్ధం ఒక్క సారే జరిగింది. కానీ ఒక రచయిత మాత్రం తాను రాసే కథతో తన మదిలో ప్రతి క్షణం ఒక కురుక్షేత్ర యుద్ధం చేస్తాడు. అది నాకు ఈ నయన పుస్తకం రాస్తున్నప్పుడు అర్థమైంది.
కనుక ఈ నయన అనే యుద్ధాన్ని మీ అందరూ ఒక కృష్ణుడిలా చదివి ఏదైనా తప్పులు దొర్లితే ఇది నా మొదటి ప్రయత్నం అనుకుని క్షమించి ఈ నయన అనే యుద్ధం మీ మనసుతో సాంగత్యం చెయ్యాలని కోరుకుంటూ మీ సాంగత్య.

సాంగత్య - Saangathya నుండి