కళాతపస్వి - Kalathapaswi
కళాతపస్వి - Kalathapaswi
'కళాతపస్వి'.. ఈ పేరు వినగానే సినిమా అంటే ఇష్టపడే ఎవరికైనా ఒకే ఒక రూపం మనసులో మెదులుతుంది.. ఆయనే ప్రముఖ దిగ్గజ దర్శకుడు శ్రీ కే.విశ్వనాథ్ గారు. ఆ మహానుభావుడికి ఉన్న కోటానుకోట్ల అభిమానులలో(భక్తుడిని అంటే మరింత బాగుంటుందేమో) నేనూ ఒకడిని.. నా పేరు రాకేశ్ బొద్దుల.
విశ్వనాథ్ గారు తెరకెక్కించిన ఎన్నో అద్భుతమైన సినిమాలను చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంగా చూస్తున్న నాలోని అభిమానికి స్వతహాగానే రాసే అలవాటు ఉండడంతో, ఆయన సినిమాలపై కూడా ఎందుకు మనం పుస్తకం రాయకూడదని భావించి వచ్చిన ఆలోచనే ఈ నా 'కళాతపస్వి'. విశ్వనాథ్ గారు ఆయన కథలతో చెక్కిన కళాత్మక రూపాలను నాకు తెలిసిన రీతిలో పాఠకుడి కళ్లకు కట్టినట్లుగా చెప్పే ప్రయత్నం చేశాను.. ఆయన సినిమాల ద్వారా నేర్పించిన విలువలను, సంప్రదాయపు పద్దతులను నా అక్షరాలతో ముడి వేశాను.. మొత్తంగా విశ్వనాథ్ గారి అభిమానులు మెచ్చేలా, ఆయన గౌరవం కాపాడేలా, ఆయన అనుసరించిన మార్గాన్ని పది మందికి చూపించే ప్రయత్నం చేద్దామని ఈ పుస్తక ప్రయాణం చేశాను.
కాశీనాథుని విశ్వనాథ్ గారి కళాత్మక చిత్రాలపై రాసుకున్న కళాతపస్వి పుస్తకాన్ని ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు శ్రీ తనికెళ్ల భరణి గారు ఇచ్చిన 'ముందుమాట'తో మొదలుపెట్టాను. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్రీ ఎంవీ రఘు గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసి ఈ పుస్తకాన్ని పాఠకుల చెంతకు చేర్చాను. విశ్వనాథ్ గారి కళాఖండాలకు ఏ మాత్రం విలువ తగ్గకుండా అద్భుతమైన విశ్లేషణతో పాటు అందమైన ఫోటోలను కూడా ఈ పుస్తకంలో జోడించాను. విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన పది సినిమాల్లోని అర్థాన్ని, పరమార్థాన్ని, పాటల్లో మాధుర్యాన్ని నాకు అనిపించిన రీతిలో చెప్పాలని.. ఆ చిత్రాలను తరతరాలు గుర్తుంచుకోవాలని ఈ అభిమాని చేసిన చిరు ప్రయత్నమే ఈ 'కళాతపస్వి'. చదివే ప్రతి పాఠకుడికి ఈ పుస్తకం ఖచ్చితంగా నచ్చుతుందని.. ఇది వారి ద్వారా మరింత ముందుకు వెళ్తుందని మనసారా కోరుకుంటూ...
మీ రాకేశ్ బొద్దుల
తక్కువ స్టాక్
పికప్ లభ్యతను లోడ్ చేయడం సాధ్యం కాలేదు.
