Skip to product information
1 యొక్క 1

Swarganiki Daari

Swarganiki Daari

Author: Kalpana Bandaru
సాధారణ ధర Rs. 250.00
సాధారణ ధర అమ్మకపు ధర Rs. 250.00
అమ్మకానికి Sold out
Shipping calculated at checkout.

   మనిషి ఒంటరిగా పుడతాడు, ఒంటరిగానే చచ్చిపోతాడు ! కానీ చావుకి పుట్టుకకి మధ్య బ్రతుకుని సాగించడానికి ప్రేమ చాలా అవసరం. తల్లిదండ్రుల ప్రేమ దొరక్కపోతే పిల్లలు ఎంత అల్లాడిపోతారో.... అలాగే జీవిత భాగస్వామి ప్రేమ దొరక్కపోయినా అంతే బాధపడతారు. అలాంటి పరిస్థితిలోనే ఉంది ఈ నవల లోనే నైషద. ఆమె ఆశించిన ప్రేమ దొరక్కపోయినా మొండిగా బ్రతికింది. ఆమె ఎప్పుడూ ఒక ఆత్మ న్యూనత భావంతో ఉండేది. అందుకు కారణం .....ఆమెకు ఏమీ చేతకాదని , ఎందుకు పనికిరాదని తన కుటుంబమే తనని అవమానించేది. ఎప్పుడూ అవమానాలు, చిత్కారాలు, వెక్కిరింపులే తప్ప ఆమెను అభిమానించిన వాళ్లు ఆమె జీవితంలో తారసపడలేదు. ఆమె చావాలని చాలాసార్లు అనుకుంది కానీ  చచ్చిపోతే వాళ్ళ మాటలు నిజం అవుతాయి. తనకి ఏమీ చేతకాదని తను ఎందుకు పనికిరాదని వాళ్ళ మాటే నిజం అవుతుందని గ్రహించి ఓర్పుతో మొండితనంతో ధైర్యంగా ముందుకు అడుగు వేసి తన జీవితాన్ని ఎలా చక్కదిద్దుకొంది అన్నదే ఈ నవల కథాంశం. నేటి సమాజంలో లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేస్తున్నారు ! అలాంటప్పుడు ఒక ఇంటి ఇల్లాలకి ఎవరైనా మర్యాద ఇస్తున్నారా  ? ఆమె ఇంటిడి చాకిరి చేసిన ఎప్పుడు ఆమెకు గౌరవం ఇవ్వరు . మరి అలాంటి ఇంటి ఇల్లాలి పరిస్థితి ఎలా ఉందో నైషద పాత్ర ద్వారా మనకు తెలుస్తుంది. ఇది కొత్త కథేమీ కాదు ! ప్రతి ఆడపిల్ల తన జీవితంలో ఇటువంటి ఎన్నో అనుభవాలను పరిస్థితులను ఎదుర్కొని ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు ! మీ ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన ఆడపిల్ల ఉండే ఉంటుంది . ఒక్కసారి అడిగి చూడండి ఆమె పడే బాధ ఏమిటో మీకు అర్థమవుతుంది.

తక్కువ స్టాక్

పరిమాణం
View full details