Narendra Babu Ramisetti
నా పేరు నరేంద్రబాబు రామిశెట్టి.ప్రస్తుతం నేను హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. రచయితగా ఇది నా తొలి ప్రయాణం. గత రెండు సంవత్సరాలుగా నా మనసులో రూపుదిద్దుకున్న భావాలను, అనుభూతులను, ఊహలను ఒక్కొక్కటిగా అక్షరాలుగా మలుస్తూ "నేను సీతామహాలక్ష్మీ ని" అనే ఈ నవలను మీ ముందుకు తీసుకొచ్చాను.
ఈ కథను రాస్తున్న రచయితగా ఇది నా మొదటి ప్రయత్నం. అందుకే ఇందులో గొప్ప సాహిత్య ప్రదర్శన ఉండకపోవచ్చు. అద్భుతమైన అలంకారాలు కనిపించకపోవచ్చు.కానీ ఒక విషయం మాత్రం నమ్మకంగా చెప్పగలను ఈ పుస్తకంలోని ప్రతి పేజీలో నా నిజాయితీ ఉంది, ప్రతి వాక్యంలో నా హృదయం ఉంది, ప్రతి భావంలో ఒక నిజమైన అనుభూతి ఉంది.
ఈ కథను చదివేటప్పుడు ఇందులోని పాత్రలను కేవలం కథలోని వ్యక్తులుగా కాకుండా, మీ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎదురైన మనుషులుగా ఊహించండి. లేదా మీరే ఈ కథలోని ఒక పాత్రగా భావిస్తూ ఈ ప్రయాణాన్ని కొనసాగించండి.
అప్పుడు ఈ కథ మీ హృదయానికి మరింత దగ్గరవుతుంది.
ఎందుకంటే ఈ కథలోని ప్రేమ, బాధ, ఆనందం, ఎడబాటు, అనుబంధాలు మనలో ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సందర్భంలో అనుభవించిన భావాలే.
ఈ పుస్తకం మీ మనసును ఒక్క క్షణమైనా తాకగలిగితే నా రచయితగా చేసిన తొలి ప్రయత్నానికి అదే అతిపెద్ద విజయంగా భావిస్తాను.
From Narendra Babu Ramisetti
-
Churakalu - Aanelu
No reviewsRegular price Rs. 250.00Regular priceSale price Rs. 250.00 -
Mine is yours
2 reviewsRegular price Rs. 170.00Regular priceSale price Rs. 170.00 -
Nalo ne lena
3 reviewsRegular price Rs. 200.00Regular priceSale price Rs. 200.00