భూమిని నేను - Bhumini nenu
భూమిని నేను - Bhumini nenu
"ప్రేమలేక మిగిలిపోయిన ప్రేమలేఖను నేను!"
ఈ ఒక్క వాక్యంలోనే స్త్రీ ఆంతరంగిక ప్రపంచం ఉంది.
ప్రేమించి భంగపడిన మానని గాయాలు ఉన్నవి.
భూ కంపాలను రిక్టర్ స్కేల్ తో కొలుస్తున్నాం,
మరి పగుళ్లొచ్చిన స్త్రీ హృదయాన్ని ఏం పరికరాలతో కొలుస్తాం?
కొలవడం మాట అటుంచితే వాళ్ళ బాధను అర్థం చేసుకుంటున్నామా?
ఇలాంటి రచనలు వచ్చినపుడు ఆమె కూడా మనలాంటి మనిషే అని తెలుసుకుంటాం.
మనలోపలి ఆధిపత్యాలను తుంచి వేసుకుంటాం.
“Bhoomi ni Nenu” is a unique literary work that reflects human emotions through the voice of the Earth. In some parts, the Earth speaks like a mother; in others, she takes the form of a girl, responding to social issues, emotions, and experiences.
This launch event will include a brief reading session, author interaction, and a discussion on the inspiration behind the book and its message.
In stock
Couldn't load pickup availability

భూమిని నేను - Bhumini nenu Details
More from సుంక ధరణి
-
అరుణిమలు - arunimalu
17 reviewsRegular price Rs. 129.00Regular priceSale price Rs. 129.00
Some lines don't just stay on the page, they stay wth you. Your wonderful Articulation of words felt like a woman's voice and the earth's inner voice coming together There's pain, softness, and strength in every line So real nd so natural I read this and instantly fell in love.
"భూమిని నేను "
అన్న టైటిల్ నేను ఇంతకు ముందు అరుణిమలు పుస్తకములో చదివాను...
"భూమిని నేను " రచయిత్రి సుంక ధరణి గారు
మంటలతో భూమి మీద ప్రశ్నలను ప్రవహింపచేసింది...
ప్రతి వాక్యం వెనక ఒక సైంటిఫిక్ టచ్ ఉంది....
"నాకు గర్భం లేదు కానీ లోకమంతా పిల్లలు ఉన్నారు"
"నాకు గర్వం లేదు కానీ శాపం అంతా అనుభవిస్తుంటాను"
అన్న రచయిత్రి మనోవేదన నాకు శ్రీశ్రీ మాటలు గుర్తుచేసాయి
ప్రపంచ బాదంతా శ్రీశ్రీ అయితే ధరణి బాధంతా రచయిత్రి స్వీయంగా అనుభవించి రాసిన ఆనవాళ్లు కనిపిస్తాయి
శబ్దము అర్థము శబ్దార్ధము మాటల ప్రవాహము సాంకేతిక పదాలు కవిత్వంలో చెప్పించి ఈ పుస్తకంలో ఈ కాలానికి కావలసిన పర్యావరణ స్పృహ పర్యావరణాన్ని కాపాడటం ప్రకృతి ఎంత విధ్వంసం అవుతుందో ఎంత బాధ పడుతుందో ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది...
"భూమిని నేనే అనే పుస్తకం ప్రకృతి యొక్క మస్తకం"
ప్రతి లైన్ లో నేను నేను అంటున్న తాను ధరణి పై జరుగుతున్న విధ్వంసానికి వ్యతిరేకంగా విజృంభించిన దీర్ఘ కవిత నిజంగా దీర్ఘమైన కవిత సుదీర్ఘమైన కవిత
సుదీర్ఘంగా ఆలోచించి ఆచరించాల్సిన కవిత
"ఒళ్లంతా ఆభరణాలైన మనసంతా గడ్డ కట్టిన మంచు ముక్కలు నేను "అన్న లైన్ లో రచయిత్రి స్వేచ్ఛనకు ఎన్ని బంధనాలు ఉన్నాయో గమనించవచ్చు
"ఖరీదు కట్టే వ్యక్తిత్వాలతో రసీదులు లేని వ్యవస్థలో మురికి మరకలు గౌరవాలకు అభిప్రాయాలను వెలిబుచ్చే గరికపరకను నేను"
ఈ మాటల్లో సమాజాన్ని విశ్లేషించిన తీరును సమాజాన్ని అర్థం చేసుకున్న తీరును సమాజాన్ని కడిగేయాలన్నా తెలియజేస్తున్నాయి...
చివరగా
"నాకోసం మీరు ఒక్క దొంగ కన్నీటి బొట్టు కార్చిన అది నాకు వంద పడుతుస్రావాలతో సమానం మరొక కపట నాటకం ఆడిన అది నాకు వెయ్యి మానభంగాల అవమానం"
అంతమయ్యే మాటలు మనిషిని ప్రకృతి వనరుల సుస్థిర అభివృద్ధిని వ్యక్తిగత నిష్టను ప్రశ్నించే ఒక అగ్నిజ్వాల అక్షరాలు గా మారడం గమనించాను...
అగ్ని దావలం దహిస్తూ అరాచకాన్ని కాలుస్తున్నట్లుంటుంది కవిత చదువుతుంటే....
రచయిత్రికి శుభాకాంక్షలు ఈ కాలంలో ఈ సమయంలో ప్రకృతిని కాపాడాల్సిన ఈ యుద్ధభూమికలు ప్రతి గొంతు లో పలకాల్సిన కవిత భూమిని నేను ప్రతి చెవు వినాల్సిన మాటలు భూమిని నేను....
అయితే చదువుతున్నప్పుడు పదప్రయోగం పదబంధాలు అంత్యప్రాసలు వీటికి కొంచెం ప్రాధాన్యం ఎక్కువగా ఇచ్చినట్టు అనిపించింది... సగటు చదువరికి అర్థమయ్యేటట్టు కొంచెం సరళమైన పదాలు వాడితే బాగుండేది అనిపించింది మొత్తంగా ఈ ఉద్విగ్న పరిస్థితుల్లో ప్రతి చదువరి చదవాల్సిన పుస్తకం భూమిని నేను...
బల్ల మహేష్ కుమార్ ✍️
9010432903
ప్రభుత్వ ఉపాధ్యాయుడు