నిశ్శబ్దపు చప్పుళ్ళు - nissabdhapu chappullu
నిశ్శబ్దపు చప్పుళ్ళు - nissabdhapu chappullu
ఇదివరకే మానసికంగా చనిపోయిన నేను
శారీరకంగా చనిపోయినంత మాత్రాన నేను గెలిచినట్టు కాదనిపించింది.
అయినా కూడా బ్రతికి ఏం చేయగలను అనిపించింది.
చనిపోవాలని అనుకున్నాను. చనిపోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాను.
నాకు అదృష్టం కూడా తోడు లేడని అప్పుడే అర్ధమైంది.
చనిపోయేందుకు చేసిన ప్రయత్నాల్లో ప్రతీ సారి విఫలం అయ్యేదాన్ని,
నా చావు కూడా నా ఓపికను పరీక్షించాలని అనుకుందేమో!
ఒంటరిగా అన్నిటినీ ఎదుర్కునే శక్తి లేదు. కానీ గడిచే ప్రతీ క్షణం నాకేదో నేర్పిస్తూనే ఉంది.
సంతోషంగా జీవించడమే జీవితం కాదు.
ఇలాంటి చేదు అనుభవాల్ని మోస్తూ భారంగా బ్రతకగలగడం కూడా గొప్ప జీవితమే అనిపించింది.
ఇప్పటికీ కూడా నాకు అర్ధంకాని విషయం... నలిగిన ఒక ఆడదాని జీవితాన్ని పదే పదే అసహ్యించుకునే సమాజమే మారనప్పుడు మగ ముసుగులో జీవించే మృగాలు మారగలవా....?
అందుబాటులో ఉంది
పికప్ లభ్యతను లోడ్ చేయడం సాధ్యం కాలేదు.
