సీతమ్మకి ఉత్తరాలు - Seethammaki Vuttharaalu
సీతమ్మకి ఉత్తరాలు - Seethammaki Vuttharaalu
సూర్య-దేవి అనే దంపతులు అనుకోని పరిస్థితుల్లో ఓ పరాయి ఇంట్లో నివసించాల్సి వస్తుంది. ఆ ఇంటి తోటలో ఉన్న ఒక సమాధి దగ్గర, తన జీవితంలో చెప్పుకోలేకపోయిన అనుభూతులు, పశ్చాత్తాపాలు తన భార్య సీతమ్మకు రాసి పెట్టిన రామన్న కథే ఈ “సీతమ్మకు ఉత్తరాలు.”
ఈ నవల పూర్తిగా 80s-90s కాలానికి చెందినది- ఒక పాత తెలుగు సినిమా చూసినట్టుగా, గుండె లోతుల్లోకి దిగే కథ. 18 నుండి 75 ఏళ్ల వరకు మనిషి అనుభవించే అన్ని భావాల్ని తాకే ఈ కథను మొదటి నవలగా రాయాలని అనిపించింది. ఎందుకంటే ఇందులో నాకు వ్యక్తిగతంగా తెలిసిన చిన్న చిన్న కథలు, అనుభవాలు, జ్ఞాపకాలు, ఊహలు అన్ని జోడించి రాశాను.
అందుబాటులో ఉంది
పికప్ లభ్యతను లోడ్ చేయడం సాధ్యం కాలేదు.

సీతమ్మకి ఉత్తరాలు - Seethammaki Vuttharaalu వివరాలు
First title చూసి young age love story అనుకున్న కానీ చదివాక తెలిసింది ఒక భర్త భార్య బతికి ఉండగా చెప్పుకోలేని ప్రేమ అని and సూర్య, దేవి లా bond కూడా చాలా బాగా రాసారు...
All the best for your upcoming writings....
Good attempt for a new writer. Honesty through out the novel. Better two different stories rather than two mixing. Liked the చివరి మాట
సీతమ్మకి ఉత్తరాలు, రచయిత నల్లం పవన్ సతీష్. ఈ నవల రచయిత తొలి రచన. తొలి రచన అయినా చాలా బాగా రాసారు. కథ మొదలయినా విధానం చాలా కొత్తగా అనిపిస్తుంది. సూర్యం, దేవి పాత్రలు పాఠకులని చాలా ఆకట్టుకుంటాయి. నాకు అయితే నవల చదువుతాన్నప్పుడు మిథునం సినిమా చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో అలాంటి ఫీలింగ్ కలిగింది.
రాయుడు గారి కథ మొదలు నవలకి టర్నింగ్ పాయింట్. రచయిత పూర్తిగా 80s-90s కి తీసుకుని వెళ్ళిపోయారు. రాయుడు - బసవం పాత్రలు పాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఆ పాత్రలు, వాళ్ళు చేసే పనులు, అప్పటి పద్ధతులు, వాళ్ళ అనుభవాలు అన్నీ చాలా బాగా రాసారు రచయిత.
రాయుడు - చింతామణి పాత్రలు మనకు చాలా నేర్పుతాయి. ఆ కర్మకు ఆ ఫలితం అని చాలా బాగా చెప్పారు. సినిమాని కానీ నవల కానీ కొంత మేర మనం ఊహించగలం తర్వాత ఏమి జరుగుతుంది అని, ఈ నవల మనకు ఆ అవకాశం ఇవ్వదు. అసలు పాటకుడు ఊహించని ట్విస్ట్లు ఉన్నాయి. ఆ ఆలోచన నాకు చాలా బాగా నచ్చింది.
అసలు సూర్యంకి రాయుడు గారి కథ ఎలా తెలిసింది, రాయుడు - చింతామణి మధ్య ఏం జరిగింది, రాయుడు సీతమ్మకి ఉత్తరాలు ఎందుకు రాశాడో తెలుసుకోవాలి అంటే సీతమ్మకి ఉత్తరాలు నవల చదవాల్సిందే.
Feel good story.
Chepinattu gaane..1980's loki teeskuni veltundhi ee pusthakam.. Kadha lo unna konni pathralu, sannivesaalu valla manaki aa anubhuthi vastundhi.
Kadha lo unna paathralu..vaari jeevitham lo edhurkune raka rakala vishayalu.. (prema, kutumbam, dabbu, social evils, adhikaaram kosam thapana, gelupu votamulu, avamaanaalu) .. Vatilo thanu chesina thappu vappula gurinchi untundhi .
Deeni valla oka sampoornamaina kadha chadivina thrupti vastundhi.