అర్జున్ s/o సుజాత రావు - Arjun s/o Sujatha Rao
అర్జున్ s/o సుజాత రావు - Arjun s/o Sujatha Rao
సుబ్బారావు - సుజాత దంపతులకి పిల్లలు పుట్టకపోవడంతో డా. ప్రకాష్ రాజ్ ని ఆశ్రయిస్తారు. ఆయన వీరికి మందులు ఇచ్చి, వైద్యం చేస్తారు. ఏడాది తిరగకుండానే పండంటి మగబిడ్డ పుడతాడు. వాడే అర్జున్.
అర్జున్ కి 2-3 ఏళ్ళు వచ్చేసరికి, వాడు చెసే విన్యాసాలకు వాడికి నొప్పి అంటే తెలీదు అని డా. మురళీకృష్ణ చెబుతారు. అప్పటికే డా. ప్రకాష్ రాజ్ వేరే నగరానికి బదిలీ అవుతారు. ఇటువంటి పిల్లలు 5 - 6 ఏళ్ల కన్నా ఎక్కువ బ్రతకరు అని చెబితే, సుజాత విధికి ఎదురేగి అర్జున్ ని ధీరుడిలా పెంచాలి అని ఆశపడుతోంది.
ఆమె ఆశ నెరవేరిందా? నిరాశగా మిగిలిపోయిందా?
అర్జున్ కి వున్నది వరమా? శాపమా? పాపమా? లోపమా?
అర్జున్ ఎదిగే కొద్దీ అతనిలా అద్భుత శక్తులు వున్న మనుషులు ఎదురు పడుతుంటారు. వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు అర్జున్ తో వుంటారా? లేక అర్జున్ ని ఎదుర్కొంటారా?
Low stock
Couldn't load pickup availability

More from విజయ్ అప్పల్ల
-
అమలోద్భవిలో అర్జునుడు - amalodbhavilo arjunudu
2 reviewsRegular price Rs. 250.00Regular priceSale price Rs. 250.00
Superb thrilling novel. Present generation ki ilanti sci-finachutayi. Netflix lo stranger things ni praise chesthunam kaani ide kanuka teeste mana Desi Pan India range hit avutundi. Excited for Part 2.
అర్జున్ S/O.సుజాత రావు
- విజయ్ అప్పల్ల
రీసెంట్ గా విజయ్ అప్పల్ల గారు రాసిన " అర్జున్ S/O.సుజాత రావు " నవల చదివాను. ఇది ఒక సైన్స్ - ఫిక్షన్ థ్రిల్లర్ నోవెల్. ఈ జోనర్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ కానీ పుస్తకాలు మాత్రం చదవలేదు, సినిమా లు మాత్రం భాష తో సంబంధం లేకుండా చూసాను. పుస్తకాలు ఏమైనా ఈ జోనర్ లో వచ్చాయా అని మాత్రం వెతికాను. నిజానికి ఈ బుక్ నా చేతికి రాకముందు కొన్ని థ్రిల్లర్ బుక్స్ కి సంబంధించి సెర్చ్ చేసినపుడు చాలా సార్లు ఈ అర్జున్ బుక్ సజెషన్ లోకి వచ్చింది. కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు. దానికి కారణం ఏంటంటే అసలు ఆ రైటర్ ఎవరో, ఎలా రాసారో, ఉరికే కొని చదివి బాలేకపోతే డబ్బులు, టైమ్ వెస్ట్ అవుతాయి కదా కొద్దిగా ఫేమస్ బుక్స్ చూద్దాం ఈ జోనర్ లో వచ్చినవి అని అనుకున్నాను. అయితే మనకి ఈ జోనర్ లో నవలలు చాలా అరుదుగా ఉన్నాయి. వీటి గురించి వెతికినపుడు మధుబాబు గారి షాడో సిరీస్, కొమ్మూరి సంబశివరావు గారి బుక్స్ అలాగే యండమూరి గారి యుగంతం లాంటి బుక్స్ ఏ కనిపించాయి. వీటి మధ్యలో అర్జున్ బుక్ కనిపించింది. వాటిని చదుకోవడం బెటర్ కదా అని అర్జున్ ని అవాయిడ్ చేశాను.
అయితే ఒకరోజు అప్పాజీ గారితో విజయ్ అప్పల్ల గారు మా ఆఫీస్ కి వచ్చారు. అప్పుడే ఆయన పరిచయం అయ్యారు. అతను పుస్తకాలు రాస్తారు అని తెలిసింది. నేను మొహమాటం లేకుండా మీరు రాసిన బుక్స్ ఉంటే ఇస్తారా చదువుతాను నాకు కాస్త ఇంట్రెస్ట్ అని చెప్పాను. వెంటనే ఈ అర్జున్ S/O.సుజాత రావు బుక్ ని ఇచ్చారు. ఎందుకులే అని నేను అవాయిడ్ చేసిన బుక్ ఇలా నా చేతికి వచ్చింది. నిజానికి కొన్ని రోజుల వరకు ఆ బుక్ తియ్యలేదు. తరువాత చదువుదాంలే అని పక్కన పెట్టాను. కానీ ఎందుకో ఒక రోజు చదవాలి అనిపించి తీసాను, మొదలు పెట్టాను ఇక అంతే ఒక 4 అవర్స్ లో కంప్లీట్ చేశాను (2 డేస్ ). నా మనీ, టైమ్ వెస్ట్ అవుతాయేమో అన్న నా ఒపీనియన్ బుక్ చదివాకా మారింది. వర్త్ వర్మ వర్త్ అనిపించింది.అందుకే ఒకసారి ఈ బుక్ గురించి నా ఒపీనియన్ చెపుదాం అని ఇలా రాయడం మొదలు పెట్టాను.
ముందుగా కథ విషయానికి వస్తే హీరో అర్జున్ పుట్టుకతోనే కొన్ని సూపర్ పవర్స్ తో పుడతాడు, పెరిగే క్రమంలో ఆ పవర్స్ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురుకుంటాడు. కానీ వల్ల అమ్మ సహకారం తో నిలబడి, వాటి గురించి పూర్తిగా తెలుసుకుంటాడు. అలా సాగుతున్న అర్జున్ లైఫ్ లోకి అతనిలా పవర్స్ ఉన్న వ్యక్తులు ఎంటర్ అవుతారు. అప్పుడు అర్జున్ లైఫ్ ఎలా మారింది?. అర్జున్ ఎం చేసాడు? అసలు ఆ వ్యక్తులు ఎవరు? అందరికి పవర్స్ ఎలా వచ్చాయి? ఆ పవర్స్ తో ఒక్కొక్కరు ఎం చేసారు అనేది కథ.
ఒక కొత్త కాన్సెప్ట్ రాసుకున్న విజయ్ గారు. దాన్ని ఉత్కంట భరితంగా నడిపారు. నెక్స్ట్ ఎం జరుగుతుంది అన్న క్యూరియసిటీ కలిగించింది. అర్జున్ జర్నీ, బంటీ తో ఫ్రెండ్షిప్, పూజ తో ప్రేమ, కరుణ్ అనే సూపర్ పవర్స్ ఉన్న విల్లన్ తో ఒక టామ్ & జెర్రీ లాంటి పోరుని చాలా ఆసక్తికరంగా నడిపారు. ప్రతి చాప్టర్ ని ఎక్కడ బోర్ కొట్టించకుండా ట్విస్ట్ లు, టర్న్ లతో రాసుకొచ్చారు.ఎంతో అనుభవం ఉందేమో ఈ జోనర్ లో కథలు రాయడం రచయిత కి అనిపించింది. కానీ ఇదే మొదటి బుక్ అనేది నిజం.
చెప్పడం మర్చిపోయా దీనికి కొనసాగింపుగా పార్ట్ 2 కూడా ఉంది.ఈ పార్ట్ 1 ని చాలా బాగా ఎండ్ చేసారు.ఎండింగ్ లో ఉంచిన సస్పెన్స్ పార్ట్ 2 కోసం వెయిట్ చేసేలా చేస్తుంది. ఆ 2 వ బాగం తొందరగా రావాలి అని కోరుకుంటున్నాను.
సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథలు ఇష్టపడే వారికి ఈ బుక్ ఖచ్చితంగా నచ్చుతుంది.పదాలు కూడా చాలా సరళంగా, మనం రోజు వాడే పదాలే ఉంటాయి.చాలా చిన్న బుక్ కూడా కేవలం 120 పేజీ లు మాత్రమే. ఒకసారి ట్రై చేస్తే ఖచ్చితంగా థ్రిల్ కి గురిచేస్తుంది. విజయ్ గారి దగ్గర నుండి అర్జున్ పార్ట్ 2 తో పాటు మరిన్ని థ్రిల్లర్ బుక్స్ రావాలి అని కోరుకుంటున్నాను.
Thanks to vijay appalla gaaru.