Nenu Seethamahalaxmi ni
Nenu Seethamahalaxmi ni
“నేను సీతామహాలక్ష్మీ ని”ఈ కథ కేవలం ఒక ప్రేమకథ కాదు.ఒక మనసు తనను తాను గుర్తించుకునే అందమైన ప్రయాణం.ఈ నవలలో మీరు చదవబోయేది అభిరామ్ – సీతామహాలక్ష్మీ ప్రేమకథ మాత్రమే కాదు. ప్రతి మనిషి హృదయంలో నిశ్శబ్దంగా దాగి ఉండే భావోద్వేగాలకు అద్దం పట్టే కథ.కొన్ని కథలు చదివిన వెంటనే మరచిపోతాం.
కొన్ని కథలు చాలా కాలం వరకు గుర్తుంటాయి.కానీ మరికొన్ని కథలు మాత్రం మన జీవితంలోనే ఎక్కడో ఒక చోట మనమే ఉన్నట్టుగా అనిపిస్తాయి.“నేను సీతామహాలక్ష్మీ ని” కూడా అలాంటి కథే.
మన చుట్టూ ప్రతిరోజూ కనిపించే మనుషులు.మనం ప్రతిరోజూ వినే మాటలు.జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనమూ అనుభవించిన భావోద్వేగాలతో అల్లుకున్న కథ ఇది.
ఈ కథలో అభిరామ్ ఉన్నాడు,సీతామహాలక్ష్మీ ఉంది.వారి మధ్య మొదలైన ఒక సాధారణ పరిచయం ప్రేమగా మారడం ఆ ప్రేమలోని మధురమైన క్షణాలు, ఎదురయ్యే ఎడబాటు,భరించలేని వేదన అంతటితో ఆగిపోదు తల్లిదండ్రుల ఆవేదన కుటుంబ అనుబంధాల విలువ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ఆప్యాయత స్నేహం, త్యాగం, బాధ్యత, నమ్మకం మన జీవితాల్లో ప్రతిరోజూ జరిగే ఎన్నో చిన్న చిన్న సంఘటనలు, మనసును కదిలించే అనుభూతులు ఈ కథలో సహజంగా ప్రవహిస్తాయి.
ఆశగా రాద్దామనుకున్న కథకి అక్షరాల తోడు ఈ "నేను సీతామహాలక్ష్మిని"
Low stock
Couldn't load pickup availability

Nenu Seethamahalaxmi ni Details
More from Narendra Babu Ramisetti
-
Churakalu - Aanelu
No reviewsRegular price Rs. 250.00Regular priceSale price Rs. 250.00 -
Mine is yours
2 reviewsRegular price Rs. 170.00Regular priceSale price Rs. 170.00 -
Nalo ne lena
3 reviewsRegular price Rs. 200.00Regular priceSale price Rs. 200.00 -
Nine Moons
1 reviewRegular price Rs. 199.00Regular priceSale price Rs. 199.00 -
aay maadi narsapuramandi - ఆయ్ మాది నర్సాపురామండి
No reviewsRegular price Rs. 350.00Regular priceSale price Rs. 350.00 -
Naalaaga Endaro - నాలాగా ఎందరో
No reviewsRegular price Rs. 250.00Regular priceSale price Rs. 250.00 -
nenkkadidanni - నేనెక్కడిదాన్ని
No reviewsRegular price Rs. 300.00Regular priceSale price Rs. 300.00 -
Swarganiki Daari
No reviewsRegular price Rs. 250.00Regular priceSale price Rs. 250.00 -
జీవచ్ఛవం - Jeevacchavam
5 reviewsRegular price Rs. 169.00Regular priceSale price Rs. 169.00 -
Krishna Rakakai Rukhmini - కృష్ణ రాకకై రుక్మిణి
18 reviewsRegular price Rs. 169.00Regular priceSale price Rs. 169.00 -
Sravani The Red Moon - శ్రావణి the Red Moon
3 reviewsRegular price Rs. 200.00Regular priceSale price Rs. 200.00 -
నయన - Nayana
5 reviewsRegular price Rs. 250.00Regular priceSale price Rs. 250.00 -
కళాతపస్వి - Kalathapaswi
No reviewsRegular price Rs. 250.00Regular priceSale price Rs. 250.00 -
స్ఫూర్తి మంత్ర - Spoorthi manthra
No reviewsRegular price Rs. 149.00Regular priceSale price Rs. 149.00 -
కాగితం పడవలు - Kaagitham Padavalu
No reviewsRegular price Rs. 150.00Regular priceSale price Rs. 150.00 -
ఇరానీ కేఫ్ - Irani Cafe
No reviewsRegular price Rs. 150.00Regular priceSale price Rs. 150.00 -
నానిగాడు - Naanigaadu
No reviewsRegular price Rs. 150.00Regular priceSale price Rs. 150.00 -
ఒక ఎండాకాలపు మధ్యాహ్నం - Oka Endaakaalapu Madhyaahnam
No reviewsRegular price Rs. 200.00Regular priceSale price Rs. 200.00 -
మచ్చుకి - మనసు పలికిన పదహారు కథలు - macchuki manasu palikina padhahaaru kathalu
22 reviewsRegular price Rs. 149.00Regular priceSale price Rs. 149.00 -
భూమిని నేను - Bhumini nenu
7 reviewsRegular price Rs. 129.00Regular priceSale price Rs. 129.00 -
మనలోనే శ్రీనివాసు - Manalone Srinivasu
15 reviewsRegular price Rs. 149.00Regular priceSale price Rs. 149.00 -
సీతమ్మకి ఉత్తరాలు - Seethammaki Vuttharaalu
15 reviewsRegular price Rs. 225.00Regular priceSale price Rs. 225.00
"This book is an absolute masterpiece of love fiction. The connection between the characters feels tender, authentic, and deeply moving. It completely swept me away from the very first chapter, capturing both the quiet beauty and the intense emotion of falling in love. A stunning, unforgettable read that will stay with me for a long time."
The book is worth it💥💥
E book chadhvuthu nene aaa prapancham lo ki vellipoyaanu.feel good story.chadhvthuntey manasuku mind ki prashanthamga.this is not only a book edhi seethamahalakshmi kathey kaadhu prathi okkari jeevithamlo jarigey oka andhamaina anubhavam.prema gurinchi prema viluva dhaani ksm okarikokaru eechukune respect long distance ela chaalane unnay cheppalantey.edhi prathi okkaru chadhavalsina oka andhamaina seethamahalakshmi katha.nice and fantastic story🫶🏻🫶🏻👏🏻👏🏻👍🏻👍🏻 congratulations and all the best to ur next thing
'నేను సీతామహాలక్ష్మిని' పుస్తకం కేవలం ఒక సాధారణ ప్రేమకథ మాత్రమే కాదు, భావోద్వేగాల అద్భుత సమ్మేళనం. అభిరామ్, సీతామహాలక్ష్మిల పరిచయం మరియు వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనలు పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. కుటుంబ అనుబంధాలు, అన్నాచెల్లెళ్ల ఆప్యాయత, స్నేహం మరియు త్యాగాలను రచయిత నరేంద్ర బాబు రామిశెట్టి గారు ఎంతో సహజంగా ఆవిష్కరించారు. కథలోని పాత్రలు మరియు సన్నివేశాలు మన నిజ జీవితానికి చాలా దగ్గరగా అనిపిస్తాయి. మనసుకు హత్తుకునే మంచి భావోద్వేగమైన కథను చదవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.
“ నేను సీతామహాలక్ష్మీ ని ’ పుస్తకం అద్భుతంగా అనిపించింది. రచయిత ప్రతి పాత్రకు ప్రాణం పోశారు. ప్రతి పాత్ర ఎంతో సహజంగా, మన కళ్ల ముందే జీవిస్తున్నట్టుగా అనిపించింది. పాత్రలకు పేర్లు పెట్టిన విధానం కూడా చాలా గొప్పగా ఉంది. కథను అల్లిన తీరు అద్భుతం. కథ చదువుతున్నంతసేపు ప్రతి సన్నివేశం మన కళ్ల ముందే జరుగుతున్నట్లుగా అనిపించి, మనమే ఆ కథలో లీనమైపోతాం. మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంతో ఆసక్తిగా చదివాను. పుస్తకం పూర్తయ్యాక కూడా ఆ పాత్రలు, ఆ భావోద్వేగాలు చాలా సేపు మనసులో నిలిచిపోతాయి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన రచనలు మీ కలం నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”
"కొన్ని కథలు చదివి ముగుస్తాయి... కొన్ని కథలు మనసులో నిలిచిపోతాయి. ఈ పుస్తకం అలాంటి అరుదైన కథల్లో ఒకటి." ❤️📖
కుటుంబం అంటే కేవలం రక్తసంబంధాలు కాదు... ఒకరినొకరు అర్థం చేసుకోవడం, నిలబెట్టుకోవడం, ప్రేమించడం అనే విషయాన్ని ఈ కథ ఎంతో హృదయాన్ని తాకేలా చెప్పింది.
ఈ కథలోని ప్రేమ ఆర్భాటంగా కాదు... జీవితంలా సహజంగా, మన చుట్టూ జరిగేదిలా నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది. ప్రతి భావోద్వేగం నిజమైనదిగా అనిపించింది. ప్రతి పాత్ర మన ఇంట్లో ఎవరో ఒకరిని గుర్తు చేసింది.
కొన్ని పుస్తకాలు వినోదాన్ని ఇస్తాయి... కానీ కొన్ని పుస్తకాలు మన ఆలోచనలను మార్చేస్తాయి. ఈ పుస్తకం చదివిన తర్వాత కుటుంబం, ప్రేమ, అనుబంధాల విలువ మరింతగా అర్థమైంది.
మొదటి రచనలోనే ఇంత లోతైన భావాలను ఇంత సహజంగా ఆవిష్కరించడం నిజంగా ప్రశంసనీయం. ఇది కేవలం ఒక కథ కాదు... మన జీవితంలోని మౌన భావాలకు అక్షర రూపం.
మీ కలం నుంచి ఇలాంటి మరెన్నో హృదయాలను తాకే కథలు పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పుస్తకం చదివే ప్రతి ఒక్కరి హృదయంలో ఒక అందమైన జ్ఞాపకంగా నిలిచిపోతుందని నమ్ముతున్నాను.
"కొన్ని పుస్తకాలు షెల్ఫ్‌లో ఉంటాయి... కొన్ని మాత్రం జీవితాంతం మనసులో ఉంటాయి. ఈ పుస్తకం రెండో కోవకు చెందింది." 🌹
నీ విజయం చూసి గర్వపడుతున్న ఒక స్నేహితురాలిగా, హృదయపూర్వక అభినందనలు!
– నీ స్నేహితురాలు, పొతురెడ్డిపల్లి ఉమా మహేశ్వరి 🌹